బాహుబలి తర్వాత అంతటి ‘వివేగం’

వివేగం.. ఇప్పుడు ఈ తమిళ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తోంది. తమిళ అగ్ర నటుడు అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ వివేగం. శివ దర్శకత్వం వహించారు. బుధవారం అర్ధరాత్రి యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. బాహుబలి తర్వాత తొలి 12 గంటల్లోనే 50 లక్షల వ్యూస్ సాధించి రికార్డులు నమోదు చేస్తోంది. అజిత్ లేటెస్ట్ మూవీ వివేగం టీజర్.. కబాలీ, విజయ్ భైరవ సినిమా వ్యూస్ లను బ్రేక్ చేసి తొలిస్థానంలో నిలిచింది.

సినిమా టీజర్ హాలీవుడ్ మేకింగ్ తో అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అజిత్ సైనికుడిగా ఈ సినిమాలో అదరగొట్టాడు. మంచు కొండల్లో అజిత్ చేసిన పోరాటాలు, యాక్షన్ సీన్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలోని లోకేషన్లు అద్భుతంగా ఉన్నాయి. యుద్ధ నేపథ్యంలోని ఈ కథ చాలా రిచ్ గా ఖర్చుకు వెనకాడకుండా తీసినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది..

ప్రస్తుతం ఇప్పటివరకు 50 లక్షల వ్యూస్ సాధించిన తొలి మూడు చిత్రాలు కబాలీ (24 గంటల్లో), ఆ తర్వాత విజయ్ భైరవ (76 గంటల్లో) ఆ తర్వాత తెలుగులో పవన్ కాటమరాయుడు (57 గంటల్లో) దక్కించుకున్నాయి. ఇప్పుడు వీటన్నింటిని తోసిరాజని అజిత్ వివేగం కేవలం 12 గంటల్లోనే 50 లక్షల వ్యూస్ సాధించి బాహుబలిని మినహాయిస్తే దక్షిణాదిలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

వివేగం ట్రైలర్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend