తండ్రిని ఓడించినా..విశాల్ పైనే ప్రేమ..

 

తమిళ హీరో విశాల్-వరలక్ష్మీ మధ్య ప్రేమ ఉందని తమిళనాట ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి ప్రేమను కాదన్నందుకే తమిళ సినీ కళాకారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్ ను పనిగట్టుకొని విశాల్ ఓడించాడనే ప్రచారం జరిగింది. శరత్ కుమార్ ఓడిపోవడం.. తమిళ నడిగర్ సంఘం విశాల్ చేజిక్కించుకోవడంతో విశాల్ కు.. శరత్ కుమార్ కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు పొడచూపాయి.

తండ్రిపై పోటీచేసిన విశాల్ ను మాత్రం వరలక్ష్మీ లైట్ తీసుకుంది. వారి మధ్య ప్రేమో ఏమో కానీ మళ్లీ విశాల్ తో నటించేందుకు ఓకే చెప్పిందట.. తండ్రికి జరిగిన అవమానం మరిచిపోయి.. తండ్రి వద్దంటున్నా కూడా వరలక్ష్మీ విశాల్ తో కలిసి నటించేందుకు ఓ కే చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

విశాల్ కొత్త మూవీని స్ట్రాట్ చేశారు. గతంలో తీసిన హిట్ మూవీ పందెంకోడికి సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు. అందులో ఓ హీరోయిన్ గా ముఖ్యపాత్రలో వరలక్ష్మీని నటింపచేసేందుకు సంప్రదించగా ఆమె ఒప్పుకున్నట్టు తెలిసింది. లింగు స్వామి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ కన్ఫమ్ అయ్యింది. చేతిలో దాదాపు ఆరు సినిమాలున్నా కూడా విశాల్ మీద ప్రేమతో ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసి వరలక్ష్మీ ఇచ్చిందట.. అందుకే వీరిమధ్య ప్రేమ నిజమేనని ఢంకా బజాయించి చెబుతున్నారు తమిళ సినీ జనాలు..

To Top

Send this to a friend