విశాఖ సేఫ్.. బాబు షేక్..


జగన్ ‘సేవ్ విశాఖ’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు వేలాది మంది తరలిరావడంపై వైసీపీ శ్రేణులే నివ్వెరపోతున్నారట.. వైసీపీ అధినేత జగన్ అనుకున్న దానికంటే కూడా విశాఖ సభ సక్సెస్ కావడానికి చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణమని వైసీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు..

విశాఖలో అధికార పార్టీ టీడీపీ మంత్రులు, ప్రభుత్వంలోని కీలక నేత కొడుకు కలిసి లక్షల ఎకరాలకు కబ్జాకు పాల్పడ్డారని పత్రికల్లో.. మీడియాలో వార్తలు వచ్చాయి. దీని విలువ దాదాపు 4 లక్షల కోట్లు అని కథనాలు వచ్చాయి. దీంతో దీన్ని క్యాష్ చేసుకునేందుకు జగన్ విశాఖలో ‘సేవ్ విశాఖ’ పేరుతో సభను నిర్వహించారు. దీనికి భూ బాధితులతో పాటు ప్రజలు, వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. వేలమంది వచ్చే సరికి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. టీడీపీ అవినీతిపై జగన్ సంధించిన అస్త్రాలకు జనం చప్పట్లు కొట్టారు.

టీడీపీ నేతల పాలన మరో రెండేళ్లలోనే అంతం అవుతుందని.. తర్వాత ప్రజాపాలన (వైసీపీ) వస్తుందని జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. వైసీపీ అధికారంలోకి రాగానే తిన్నదంతా కక్కిస్తామని.. చంద్రబాబు సహా టీడీపీ నేతల కబ్జా పర్వాన్ని బయటకు లాగి.. పేదలకు ఆ భూమి తిరిగి ఇచ్చేస్తామని జగన్ ప్రతిన బూనారు. జగన్ మాట్లాడిన ప్రతిమాటకు సభకు హాజరైన జనం ఆయనకు మద్దతు తెలుపుతూ జై జగన్, వైసీపీ నినాదాలు చేయడం గమనార్హం. మొత్తానికి భారీ జనసందోహం తరలివచ్చి సేవ్ విశాఖను దాంతో పాటు జగన్ ను క్రేజ్ ను చాటిచెప్పారు. ఈ దెబ్బకు బాబు అండ్ కో షాక్ కు గురయ్యారు.

To Top

Send this to a friend