టీడీపీ మెడకు విశాఖ కుంభకోణం 

 

విశాఖలో భూ కుంభకోణాలు గుబులు రేపుతున్నాయి. బ్రోకర్లు, కబ్జాదారుల మాటున టీడీపీ నేతలు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధినేత కుమారుడు ఈ కుంభకోణంలో ఇన్ వాల్వ్ అయ్యాడని.. ఆయన బినామీల మీద ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయ్యిందని వార్తలు వెలువడడం సంచలనంగా మారింది. టీడీపీ నేతల భూమాయపై ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో టీడీపీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ భూమాయపై ఆరా తీసింది. అయితే దీని వెనుక స్థానిక టీడీపీ మంత్రి ఉన్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విశాఖకే చెందిన మరో మంత్రి   విమర్శలు కూడా చేశారు. ఇద్దరు ఒకరినొకరు ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖలు రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇలా ఇద్దరు మంత్రులు భూ కుంభకోణంలో ఆరోపణలు చేసుకోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ముఖ్యంగా ఈ కుంభకోణంలో భూములు పొందిన ప్రభుత్వాధినేత కొడుకు ఉన్నాడనే వార్త దావనంలా వ్యాపించి చంద్రబాబు సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ, సాక్షి మీడియా విశాక భూకుంభకోణాన్ని పునాదుల నుంచి తవ్వుతోంది. ఇందులో మంత్రులు, బినామీలు, ప్రభుత్వాధినేతల పేర్లు బయటకొస్తున్నాయి.  ఈ వివాదం టీడీపీలోనే విమర్శలకు తావిస్తోంది. స్వయానా టీడీపీ మంత్రే ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు.

To Top

Send this to a friend