వీఐపీ, గీఐపీ జాన్తా నై..


ప్రధాని అయితేనేం.. రాష్ట్రపతి అయితే అంతా ఒక్కటేనని నిరూపిస్తున్నారు ప్రధాని మోడీజీ.. వీఐపీ సంస్కృతికి వీడ్కోలు పలికారు. ఇక నుంచి ఎవ్వరూ బుగ్గ కార్లు వాడొద్దని అల్టిమేటం జారీ చేశారు. కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం సహా కేంద్రమంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి లాంటి వీఐపీల కార్లకు ఎర్రబుగ్గ ఉండదు. వారు సాధారణ పౌరుల వలే రోడ్ల వెంట పరుగులు తీయాలి.

మోడీ తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఎర్రబుగ్గ ఉంటే చాలు మన నేతలకు రోడ్లపై సపరేట్ ట్రాక్, వారికి వీఐపీ సేవలు అందేవి. ఎక్కడికి వెళ్లిన గౌరవ మర్యాలు ఇచ్చేవారు. కానీ ఇక నుంచి ఈ సంస్కృతి ఉండదు. అందరూ సమానంగా రోడ్లపై, ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే.. నాలుగు రోజుల్లో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మోడీ ఈ నిర్ణయం తీసుకోవడంతో కలిసివచ్చే అవకాశం ఉంది.

ఇక నుంచి దేశంలో ఏ నాయకుడికి బుగ్గకార్లు ఉండవు.. ఒక్క అంబులెన్స్, అగ్నిమాపక యంత్రం లాంటి అత్యవసర సర్వీసులు తప్ప ఏ ఇతర వాహనాలు బుగ్గలు వాడినా చట్టవ్యతిరేకమే.. బుధవారం ఈ మేరకు కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2013లో సుప్రీం కోర్టు ఎరుపు, నీలం బుగ్గకార్లను పరిమితం చేయాలని ఆదేశాలిచ్చింది. కానీ రాష్ట్రాలు పట్టించుకోకపోవడంతో ఇప్పటీకీ ఈ సంస్కృతి రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఇప్పుడు ఏకంగా మోడీ ప్రభుత్వం మొత్తం బుగ్గ కారులనే ఉండరాదని తొలగించింది.

To Top

Send this to a friend