కల్పనకు పెద్ద విలన్ అయనేనట..

ప్రస్తుతం బిగ్ బాస్ లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సింగర్ కల్పన జీవితం సంసార జీవితం పూలపాన్పు కాదు.. ఎన్నో కష్టనష్టాలకు గురైంది. కల్పనకు పెళ్లి అయ్యింది. ఒక పాప కూడా.. కల్పన పేరు ప్రఖ్యాతలు చూసి అసూయతో ఆమె భర్త టార్చర్ పెట్టాడు. అది భరించలేక విడాకులు తీసుకుంది. ఇది ఆమె జీవితంలో అత్యంత విషాధకర సంఘటన.. ఆ తర్వాత ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. కానీ తర్వాత పడిలేచిన కెరటంలా ఎదిగింది.. ఆమె జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు ఎందరికో స్ఫూర్తిదాయకం.. తెలుగులో టాప్ సింగర్ గా కొనసాగుతున్న కల్పన ఇప్పుడు బిగ్ బాస్ షోలో సందడి చేస్తోంది. ఆమె పాడిన ఎన్నో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముసుగు వేయొద్దు మనసుమీద.. ఏ జిల్లా ఏ జిల్లా. గోంకూర తోటకూడ కాపుకాస లాంటి కల్పన పాడిన పాటలు యూత్ ను ఊపేశాయి.. ఈ పాటలతో కల్పన పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.. ఈమె క్లాస్ సాంగ్స్, గజల్స్, ట్రెడిషినల్ పాటలు అద్భుతంగా పాడగలదు..

కల్పన స్వస్థలం తమిళనాడు.. తండ్రి ప్రముఖ నటుడు సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ టీఎస్ రాఘవేంద్ర.. తల్లి సులోచన కూడా సింగరే.. చెల్లి ప్రసన్న రాఘవేంద్ర కూడా మంచి ఓపెరా సింగర్.. మధురై టీ. శ్రీనివాస్ దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకుంది కల్పన.సంగీత కుటుంబం నుంచి రావడంతో ఎంత సంక్లిష్టమైన రాగాలను కూడా కల్పన సులువుగా పాడుతుంది. సంగీతమే కాదు.. చదువులో కూడా ఆమె ఫస్టే.. ఏంసీఏ చేశాక ఆయుర్వేద సిద్ధమెడిసిన్ కూడా కంప్లీట్ చేసింది. మాతృభాష తమిళమమే అయినా మళయాళం, తెలుగు, జర్మన్, ఇటాలియన్ , స్పానిష్, అరబిక్ భాషలు కూడా తెలుసు. తెలుగులో తన సినీ కెరీర్ ను ఐదేళ్ల వయసులోనే స్ట్రాట్ చేసింది. అప్పట్లో వచ్చిన మనోహరం సినిమాలోని మంగళగౌరి అనే పాటతో సింగర్ గా ప్రస్థానం మొదలు పెట్టింది. తెలుగు తమిళమే కాదు విదేశీ భాషల్లో కూడా పాటలు పాడి మెప్పించింది కల్పన.. మళయాళం ఓ షో కోసం ఏకంగా మళయాళం నేర్చుకొని ఆ షో విన్నర్ గా నిలవడం అప్పట్లో సంచలనమైంది.

కానీ ఆత్మవిశ్వాసంతో పడిలేచిన కెరటంలా తన కెరీర్ లో మళ్లీ దూసుకుపోతోంది. ఆమె ఎంతో మంది సింగర్ లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ షో లో పార్టిసిపెంట్ గా చేస్తూ ఇంకా పాపులర్ అయ్యింది కల్పన.. ఈ షోలో కెప్టెన్ గా తన మార్క్ ను చూపించింది. ఒకప్పుడు విడాకులు తీసుకొని కృంగిపోయిన కల్పన నేడు అందరికీ సాయం చేస్తూ సెలబ్రెటీగా ఎదిగింది. ఆమె జీవితం పడిలేచిన కెరటం.. అందరికీ స్ఫూర్తి దాయకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend