విజయ్ మాల్యా అరెస్ట్..

అపరకుబేరుడికి చెక్ పడింది. ప్రధాని మోడీ ఒత్తిడి ఫలించింది. దాదాపు 9వేల కోట్ల బ్యాంకుల వద్ద రుణం తీసు కొని ఎగ్గొట్టి బ్రిటన్ దేశం చెక్కేసి అక్కడ విలాస జీవితం గడుపుతున్న విజయ్ మాల్యా కథ కంచికి చేరింది. భారత్ ఒత్తిడితో బ్రిటన్ దిగొచ్చింది.

లండన్ లో తలదాచుకుంటున్న భారత లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఈరోజు స్కాట్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్ కోర్టు ముందు ఆయనను ఇవ్వాళ హాజరుపరుచునున్నారు. భారత్ విజ్ఞప్తి మేరకు బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను అరెస్ట్ చేసింది. విజయ్ మాల్యా అరెస్ట్ అవడంతో భారత్ నుంచి సీబీఐ అధికారులు లండన్ బయలు దేరారు.

విజయ్ మాల్యాను భారత్ రప్పించాక.. ఆయన ఎగ్గొట్టిన 9వేల కోట్లను రికవరీ చేయనున్నారు. ఆయనకున్న ఎన్నో ఆస్తులను వేలం వేసి బ్యాంకుల అప్పులు తీర్చనున్నారు. కాగా విజయ్ మాల్యాను కొందరు దేశం నుంచి తప్పించారని.. నాయకులు ఆయన్ను రక్షిస్తున్నారని దేశవ్యాప్తంగా దుమారం రేగింది. వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యాను అరెస్ట్ చేయాలని దేశంలో ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం ఎట్టకేలకు విజయ్ మాల్యాకు చెక్ చెప్పింది.

To Top

Send this to a friend