వెరి గుడ్‌ బాలయ్య


దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణంతో టాలీవుడ్‌ పెద్ద దిక్కును కోల్పోయింది. తెలుగు సినీ లోకం కన్నీరు కార్చింది. దాసరి కడసారి చూసేందుకు లక్షల్లో జనాలు క్యూ కట్టారు. అయితే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలు మాత్రం దాసరి చివరి చూపు నోచుకోలేదు. చిరంజీవి చైనాలో కుటుంబం మరియు మిత్రలతో ఉండగా విషయం తెల్సింది. చైనా నుండి దాసరి చివరి చూపుకు రావడం ఇబ్బంది అయ్యింది. దాంతో తాజాగా సంతాప సభలో చిరంజీవి పాల్గొని తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. ఇక బాలకృష్ణ ‘పైసా వసూల్‌’ చిత్రం కోసం పోర్చ్‌గల్‌లో ఉన్నాడు.

దాసరి మరణంపై బాలయ్య వెంటనే స్పందించాడు. ఒక ప్రెస్‌నోట్‌ విడుదల చేసి అక్కడే శ్రద్దాంజలి గటించాడు. అయితే తాజాగా సంతాప సభకు కూడా బాలయ్య రాలేక పోయాడు. దాంతో పోర్ట్‌గల్‌లోనే దాసరి చిత్ర పటంను ఏర్పాటు చేసి చిన్న సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది. బాలకృష్ణతో పాటు దర్శకుడు పూరి జగన్నాధ్‌ మరియు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సంతాప సభలో పాల్గొని దాసరి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలని అంతా కోరుకున్నారు. విదేశాల్లో ఉన్నా కూడా దాసరి మృతికి సంతాపం తెలిపేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన బాలయ్యను అంతా వెరి గుడ్‌ అంటున్నారు.

To Top

Send this to a friend