వేపపువ్వుతో ఉపయోగాలెన్నో


వేపచెట్టే ఒక ఔషధ భాండాగారం.. చెట్టులోని ప్రతీభాగమూ ఎంతో ఉపయోగం అని శాస్త్రవేత్తలు తేల్చారు.. వాటి ఆకులూ కాండంతోపాటు గుబాళించే వేపపువ్వూ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే ఈ కాలంలో ఆకులు రాల్చి విరబూసే వేపపువ్వును సేకరించి ఎండబెట్టి, పొడిచేసి ఉంచి, ఏడాది పొడవునా వాడుకుంటుంటారు. ఈ పూలను పారిశ్రామికంగా అనేక ఔషధాలలో, గాయాల నివారణకు వాడే ఆయింట్‌మెంట్లలోనూ.. సౌందర్య ఉత్పత్తుల్లోనూ వాడతారు. వాసన కోసం కొన్ని రకాల ఆహారపదార్థాల్లోనూ ఉపయోగిస్తుంటారు. రకరకాల వ్యాధుల నివారణలోనూ వాడుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

* జీలకర్ర, వేపపూలపొడి కలిపిన పానీయాన్ని తాగితే ఆకలి పెరుగుతుందట.

* ఎండిన ఈ పూలతో చేసిన పొడిని ఆహార పదార్థాల్లో చల్లుకుని తినడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది.

* ఆకులతో పాటు ఈ పూలను వేసి రుబ్బిన ముద్దవల్ల చర్మసంబంధమైన ఇన్ఫెక్షన్లూ మొహంమీద వచ్చే మొటిమలూ కూడా తగ్గుముఖం పడతాయి.

* ఈ పూలల్లో ఉండే గాఢతైలాలను పరిమళ చికిత్సలోనూ వాడతారు. ఈ తైలం మెదడును ప్రశాంతంగా ఉంచేందుకు దోహదపడుతుంది.

* ఈ పూలతో చేసిన పొడిని ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయాన్నే తాగితే కాలేయంలోని టాక్సిన్లన్నీ బయటకుపోతాయి.ఈ పొడి రక్తశుద్ధికీ తోడ్పడుతుంది. రక్తంలోని మలినాలన్నీ కూడా పోయి, చర్మం కాంతివంతమవుతుంది.

* రోజూ ఈ పూలను ఏదో ఒక రూపంలో తీసుకోవడంవల్ల జీవక్రియ బాగుంటుంది. రక్తనాళాలు చక్కగా పనిచేస్తాయి. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. రక్తంలో చక్కెరశాతం నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు, బరువుతోపాటు పొట్ట తగ్గాలనుకునేవాళ్లకి ఈ పూలు ఎంతో మేలు చేస్తాయట.

To Top

Send this to a friend