30రోజులు పూర్తిచేసుకున్న‌ ‘వెంకటాపురం’

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా నిర్మించిన‌ సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం మే 12న విడుద‌ల‌య్యి మంచి రెస్పాన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతూ ముందుకు వెలుతుంది. యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వ‌హించారు. ఈ చిత్రం దాదాపు 15 దియోట‌ర్స్ లో 30 రోజులు పూర్తిచేసుకుని ముందుకు దూసుకుపోతుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… మా బ్యాన‌ర్ లో నాల్గొవ చిత్రంగా విడుద‌ల‌య్యిన వెంక‌టాపురం విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు పోంది ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతుంది. ఈ రోజుల్లో మా లాంటి చిన్న చిత్రాలు రెండ‌వ వారం ఆడ‌టమే చాలా క‌ష్టం గా వుంటే మా చిత్రానికి ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ 30 రోజుల వ‌ర‌కూ అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి మా యూనిట్ త‌రుపున ధ‌న్య‌వాదాలు. ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో స‌రికొత్త క‌థ‌నంతో ఆధ్యంతం ఆసక్తి కరంగా తెర‌కెక్కించ‌టం వ‌ల‌న ప్రేక్ష‌కులు థ్రిల్ ఫీల‌య్యారు. వైజాగ్ నెప‌ధ్యంలో సాగే యూత్‌ఫుల్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. హీరో రాహుల్ న్యూ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకోవ‌టం చాలా ప్ల‌స్ అయ్యింది. దర్శకుడు వేణు అద్భుతమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. మా చిత్రానికి సాయిప్ర‌కాష్ కెమెరా వ‌ర్క్ హైలెట్ గా నిలిచింది. అచ్చు అందించిన ఆడియో మంచి విజ‌యం సాదించింది. ఇవ‌న్ని మా చిత్ర విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాయి. అని అన్నారు

నటీనటులు –
రాహుల్, మహిమా మక్వాన్, అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ తదితరులు
సాంకేతిక నిపుణులు –
ప్రొడక్షన్ కంట్రోలర్: వాసిరెడ్డిసాయిబాబు, డ్యాన్స్ మాస్టర్: అనీష్ విజ్ఞేష్, అనిత నాథ్, కెమెరా: సాయిప్రకాష్ ఆర్ట్: జె.మోహన్, మ్యూజిక్: అచ్చు, కొ-ప్రోడ్యూస‌ర్: ఉమాదేవి కున‌ప‌రాజు ప్రొడ్యూసర్స్: శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్, స్టోరీ, డైరెక్టర్: వేణు మాధికంటి

To Top

Send this to a friend