వేలమంది భవిష్యత్తుతో ఆ మంత్రి ఆటలు


అప్పట్లో తెలంగాణలో లీక్ అయిన ఎంసెట్ వ్యవహారంలో ఏపీలోని ఓ బడా విద్యావేత్త పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనే డబ్బులు వెదజల్లి ఎంసెట్ లీక్ చేశారని.. ఇలానే ప్రతిసంవత్సరం జరుగుతోందని.. కానీ పోయిన సారి మాత్రమే ఈ విషయం బయటకు వచ్చిందని విశ్వసనీయంగా తెలిసింది.

కానీ ఆ లీకు వీరుడు తెలంగాణలోనే కాదు.. ఇప్పుడు తన విద్యార్థులకు ర్యాంకుల కోసం ఏపీలోనూ లీక్ చేసి దొరికిపోయాడు. ఏపీలో మొదలైన పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను లీక్ చేసి ఏపీ మంత్రి నారాయణకు చెందిన పాఠశాల సిబ్బంది మీడియాకు దొరికిపోవడం కలకలం రేపింది. ఆ పాఠశాల ఏపీ మంత్రి నారాయణది కావడంతో ఆయన ప్రోద్బలంతో ఇదంతా జరిగిందని విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి గంట శ్రీనివాసరావు సైతం నారాయణకు వియ్యంకుడు కావడంతో ఈ లీక్ వ్యవహారాన్ని ఇద్దరు కలిసి తొక్కేశారు. అందుకే ఏ మీడియాలో.. పత్రికలో దీనిపై పెద్దగా వార్తలు రావడం లేదు..

వేలాది మంది విద్యార్థులు రాత్రిపగలు చదవి పరీక్షలు రాస్తే.. కోట్లకు పడగలెత్తి విద్యాసంస్థల పేరుతో దండుకుంటున్న ఈ ప్రభుత్వ పెద్దలు.. పేపర్లు లీక్ చేస్తూ తమ విద్యార్థులకు అందిస్తూ ర్యాంకులు సంపాదిస్తున్నారు. కష్టపడి చదివిన విద్యార్థులను వెనక్కి నెట్టుతున్నారు. ఇంత అడ్డగోలుగా ఏపీలో విద్యావ్యవస్థ కునారిల్లుతున్నా ఏపీ సీఎం చంద్రబాబు కళ్లకు గంతలు కట్టుకొని పరిపాలించడం విస్మయం కలిగిస్తోంది..

To Top

Send this to a friend