విద్యన్న.. మహాభినిష్ర్కమణం..


నీరు.. కేసీఆర్ కంట నీరు.. ఉబికి వస్తున్న దు:ఖాన్ని దిగమింగి మౌనంగా రోదిస్తున్న తీరు.. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన మాజీ చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్ రావు పార్థీవ దేహం చూసి బోరుమున్న కేసీఆర్.. అంతకుముందు రోజు.. తన తో పాటు పాదం కదిపి తెలంగాణ నీటి కష్టాలు తీర్చేందుకు ఎగిసిన ఓ ఉద్యమ కెరటం.. నేడు అలిసి సొలిసి అంపశయ్యపై ఉన్న వేళ.. ‘విద్యన్న.. విద్యన్న’ అన్న పలుకులు విద్యాసాగర్ రావును కదిలించాయి.. కేసీఆర్ వచ్చిండా.. అన్న ఆయన మాటలకు కేసీఆర్ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి.

తెలంగాణ సమాజంలో ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత తెలంగాణ కోసం అంత సేవ చేసిన మహానుభావుడు మాజీ చీఫ్ ఇంజనీర్, తెలంగాణ ఉద్యమ కారుడు విద్యాసాగర్ రావు.. తెలంగాణ నీటి గోస తీర్చాలని.. ప్రాజెక్టులకు రూపు ఇవ్వాలని తెలంగాణ నీటి పారుదల సలహాదారుగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. కేటీఆర్, హరీష్ వంటి దిగ్గజాలుండగా కూడా కేంద్రంలో ఢిల్లీ మీటింగ్ లో విద్యాసాగర్ రావునే కేసీఆర్ పంపేవారు. ఆయన అనుభవం అలాంటిది. విద్యాసాగర్ నీటి లెక్కలు చెబుతుంటే అందరూ శ్రద్ధగా వినేవారే.. అంతటి గొప్ప వ్యక్తి మహాభినిష్క్రమణం ఇంత త్వరగా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు..

తెలంగాణ రాకముందే జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ మరణం.. తెలంగాణ సాధించాక. ఇప్పుడు విద్యాసాగర్ రావు మరణం .. ఇలా తెలంగాణ తన అమ్ముల పొదిలో ఆస్త్రాలన్నీ అస్త్ర సన్యాసం చేసినట్టు ఒక్కో ఆయుధం రాలిపోతోంది. తెలంగాణకు ధృవతారలై వెలుగొందుతున్నారు. వారి ఆలోచనలు.. బాటల్లో తెలంగాణ నడవాలని కోరుకుంటోంది.. తెలంగాణ నీటి గోసను ఎలుగెత్తిన విద్యన్నకు తెలంగాణ సమాజం ఆశ్రునివాళి అర్పిస్తోంది.

To Top

Send this to a friend