వర్మ సంచలన నిర్ణయం..


ఎన్నో వివాదాస్పద అంశాలు.. ఎన్నో ట్వీట్లు.. అన్నీ సంచలనం.. వివాదాస్పదమే వర్మను తిట్టనోళ్లు లేరు.. అలాగే వర్మ తిట్టని హీరో లేడు.. అప్పట్లో గణపతి దేవుడిని అవమానించేలా ట్వీట్ చేయడం దుమారం.. మరోసారి పవన్ పై చేసిన విమర్శలు కాకరేపాయి.. కానీ ఈ ఉదయం ఏ జ్ఞానోదయం అయ్యిందో తెలియదు కానీ.. రాంగోపాల్ వర్మ మారిపోయాడు.. ఇకపై మెగా హీరోలపై కానీ.. ఎవ్వరిపైనా కానీ వ్యతిరేకంగా ట్వీట్లు చేయనని సంచలన ప్రకటన చేశాడు. ట్విట్టర్ లో ఈమేరకు పేర్కొన్నాడు..

తాను పూర్తిగా మారిపోయానని.. అమ్మ మీద, దర్శకుడు స్పీల్ బర్గ్ మీద, అమితాబ్ బచ్చన్ మీద ఒట్టేసి చెబుతున్నానని ట్వీట్ చేశాడు.. టాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్ వల్లే తాను మారుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు.. ఇక పై తాను మెగాహీరోల గురించి ఇకపై ట్వీట్లు చేయను అని చెప్పి ఆ తర్వాత వారిపై ట్వీట్లు చేశాడు. ఇలా మారిపోయానని చెప్పి మళ్లీ నోటి దురుసు వ్యాఖ్యలు చేయడం వర్మకు అలవాటే.. మరి అలాంటి మార్పా.? లేక నిజంగానే మారాడా అన్న సంగతి తెలియాల్సి ఉంది.

To Top

Send this to a friend