వరలక్ష్మి విలనిజం…


తమిళ  హీరో శరత్ కుమార్ తనయ వరలక్ష్మితమిళంలో మలయాళం లో చాలా సినిమాలు చేసినా గాని హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది.అలాంటి తరుణంలో విశాల్ హీరోగా నటించిన పందెం కోడి 2 చిత్రంలో లేడీ విలన్ గా నటించే అవకాశం వచ్చింది.దాన్ని అద్భుతంగా మెప్పించింది.దాంతో విలన్ పాత్రలు వరలక్ష్మిని వెతుక్కొంటూ వస్తున్నాయి. ఆశ్చర్య కరంగా వరలక్ష్మి తెలుగులో కూడా నెగటివ్ రోల్ తోనే ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన తెనాలి రామకృష్ణ బీఏ బి ఎల్ చిత్రం తో తెలుగునాట ఆడ విలన్ గా తడాఖా చూపించింది. ఇక రాబోయే రవితేజ చిత్రం క్రాక్ లో కూడా దుర్మార్గురాలి గానే దర్శనమివ్వ బోతోంది.

To Top

Send this to a friend