వంశీ గారు.. మారితేనే ఉండండి.

అప్పట్లో వంశీ సినిమా అంటే ఒక ప్రత్యేకమైన సినిమాగా గుర్తింపు ఉండేది. ఎన్నో అద్బుత చిత్రాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయిన వంశీ గత 15 సంవత్సరాలుగా ఏమాత్రం ఆకట్టుకోని సినిమాలను తెరకెక్కిస్తూ చిరాకు తెప్పిస్తున్నాడు. రవితేజ, కళ్యాణిలు నటించిన ‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’ తర్వాత వంశీ మార్క్‌ సినిమా రాలేదు. అప్పటి నుండి కూడా ఫ్లాప్‌లతో సహవాసం చేస్తూ వస్తున్న వంశీ మరోసారి ఫ్లాప్‌ చిత్రాన్ని తీసుకు వచ్చాడు.

వంశీ దర్శకత్వంలో తాజాగా వచ్చిన ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా టైటిల్‌లో ఫ్యాషన్‌ ఉంది కాని, సినిమా మొత్తం 1980లో మాదిరిగానే ఉంది. అప్పట్లో వంశీ చేసిన సినిమాలు అప్పటి ప్రేక్షకులను అలరించాయి. అవే సినిమాలతో ఇప్పుడు ప్రేక్షకులను అలరించాలనుకోవడం పొరపాటు. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారింది. మారుతూనే ఉంది. మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు చేయకపోతే అవి వృదా ప్రయత్నం అవుతుంది అనేది వంశీకి ఇప్పటికైనా అర్థం అవ్వాలి.

తాను మారలేను, తాను అప్పటి తరహాలోనే సినిమాలు చేయగలను, కొత్త ట్రెండ్‌కు తగ్గట్లుగా సినిమాలు చేయలేను అన్నట్లుగా వంశీ భావిస్తే సినిమాలకు దూరం అవ్వడం ఉత్తమం. సినిమాలు తీయడం ఫ్లాప్‌లు పొందడం వల్ల అప్పటి వంశీ క్రేజ్‌ మసక బారి పోతుంది. అందుకే మారితే మళ్లీ సినిమాలు చేయాలి, లేదంటే సర్దేసుకోవాల్సిందే అంటూ వంశీకి సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులు సలహాలు ఇస్తున్నారు

To Top

Send this to a friend