వంశీ మరో ప్రయత్నం, కృష్ణభగవాన్‌ సాయంతో..!

తెలుగులో ఎన్నో క్లాసిక్‌ చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్‌ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న దర్శకుడు వంశీ. అదంతా గతం, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా విభిన్నం. దాదాపు పదిహేను సంవత్సరాలుగా వంశీకి మంచి సక్సెస్‌ పడినది లేదు. రవితేజ హీరోగా నటించిన ‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్న వంశీ అప్పటి నుండి కూడా సక్సెస్‌ మొహం చూసినది లేదు. ఎన్నో చిత్రాలు చేసిన వంశీ కొన్ని సినిమాలు విడుదలకు కూడా నోచుకోలేదు. తాజాగా ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’ చిత్రంతో వంశీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

వంశీ తాజాగా తెరకెక్కించిన ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో వంశీ మళ్లీ సినిమాలు చేయవద్దని సినీ విశ్లేషకులు మరియు ఆయన అభిమానులు కూడా కోరుతున్నారు. కాని వంశీ మాత్రం మరో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. కృష్ణ భగవాన్‌ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించనుండగా వంశీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. త్వరలోనే ఆ సినిమా ప్రకటన రాబోతుంది. ప్రస్తుత జనరేషన్‌కు తగ్గ సినిమాలు చేయలేడు అని తేలిపోయినా కూడా వంశీ ఇంకా సినిమాలు చేయడం ఏంటని విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

To Top

Send this to a friend