వామ్మో.. 10 కోట్లా…


బాహుబలితో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు హీరో ప్రభాస్. తెలుగు, తమిళం, మళయాలం, హిందీల్లో ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు.. ఇక బాహుబలి2 రిలీజ్ అయితే ఇక ప్రభాస్ కు తిరుగుండదు..

అందుకే తనకు ఉన్న మార్కెట్ ను క్యాష్ చేసుకునేందుకు వెనుకాడడం లేదు ప్రభాస్.. ఇటీవల ఓ బ్రాండ్ కు ఏడాదిపాటు అంబాసిడర్ గా ఉండడానికి దాదాపు 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడట.. దీంతో యాడ్ ఫిల్మ్ మేకర్లు ఆలోచనలో పడ్డారట.. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి 5 నుంచి 6 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేస్తారట.. అలాంటిది ప్రభాస్ పదికోట్ల రూపాయలు అడగడం వారిని ఇబ్బందికి గురిచేసింది..

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో మార్కెట్ లేదు. దక్షిణాది హీరోలకు హిందీలో మార్కెట్ లేదు. అదే బాహుబలితో ప్రభాస్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. అందుకే ప్రభాస్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్న కార్పొరేట్ కంపెనీలకు ప్రభాస్ చెబుతున్న రేట్ చూసి నోరెల్లబెడుతున్నారట.. ఎంత పెద్ద సినిమా తీసి ఎంత హిట్ అయినా ఇంత రేటా అని అడుగుతున్నారు. కానీ ఇదంత జక్కన్న రాజమౌళి ఘనతే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend