వాళ్ల ఆస్తులు అమ్మి ఇవ్వొచ్చుకదా..


అగ్రిగోల్డ్ స్కాంలో వేలకోట్ల ప్రజాధనం దోచుకున్నారని.. కానీ వారి ఆస్తులు, భూములు, కార్యాలయాలు వేల కోట్ల విలువ చేస్తాయని.. వాటన్నింటిని ప్రభుత్వం అమ్మి బాధితులకు చెల్లించాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అగ్రిగోల్డ్ పై పోరాడుతున్న వామపక్షాలతో కలిసి పోరాటం చేయడానికి తాను సిద్ధమని పవన్ ప్రకటించారు.

కానీ అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రులే కొంటున్నారని.. ఈ ఆస్తులు వారికి దక్కకుండా పేదలకు దక్కాలని పవన్ స్పష్టం చేశారు. సత్యం, సహారా కుంభకోణాలలాగా అగ్రిగోల్డ్ సమస్యను కూడా ఎవరైనా టేకోవర్ చేసుకొని బాధితులకు న్యాయం చేయాలని పవన్ డిమాండ్ చేశారు. 40 లక్షల మంది జీవితాలు దెబ్బతినకుండా చంద్రబాబు, మోడీల దృష్టికి తీసుకెల్లి సమస్యను పరిష్కరిస్తానని పవన్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన అగ్రిగోల్డ్ బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు. తమ ఆస్తులు, డబ్బులు కొల్లగొట్టారని.. తమకు దేవుడు లాంటి పవన్ న్యాయం చేస్తాడని ఆశిస్తామని చెప్పారు.

To Top

Send this to a friend