వాయిదా.. కారణం అదేనా.?


ఏమైందో ఏమో కానీ మెగా హీరో వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘మిస్టర్’ వాయిదా పడింది. మొదట మిస్టర్ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ దాన్ని ఒక రోజు ముందుకు జరిపి ఏప్రిల్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ సినిమా పూర్తి కాలేదో.. లేక బాగా రాలేదో తెలియదు కానీ ఈ సినిమా అనుకున్న ప్రకారం విడుదల కావడం లేదు. ఈ విషయాన్ని నిర్మాత, దర్శకుడు శ్రీనువైట్ల ప్రకటించారు.

శ్రీనువైట్ల ఎంతో ఒత్తిడి మధ్య వరుణ్ తేజ్ సినిమాను చేపట్టాడు. కొన్నేళ్లుగా సరైన హిట్ లు లేక ఇబ్బందిపడుతున్న దర్శకుడు శ్రీనువైట్ల ఈ ప్రాజెక్టు హిట్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా తనదైన స్టైల్లో లవ్ స్టోరీని తీసుకొని తీశారట.. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ లు కూడా చిత్రంపై పాజిటివ్ టాక్ ను క్రియేట్ చేశాయి. కానీ ఇప్పుడు సినిమాను వాయిదా వేయడంతో అవుట్ పుట్ సరిగ్గా రాలేదనే టాక్ వినిపిస్తోంది..

కాగా మిస్టర్ చిత్రం ఆడియో ప్రీ రిలీజ్ వేడుకను ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హెబ్బా పటేల్, లావణ్య త్రిపాటి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

To Top

Send this to a friend