బాహుబలితో సమానంగా చిరు ‘ఉయ్యాలవాడ’

తెలుగు సినిమాకు భారతదేశ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించిన సినిమా బాహుబలి. రాజమౌళి చెక్కిన ఈ శిల్పంతో తెలుగు సినిమా మార్కెట్ దేశవ్యాప్తం అయ్యింది. దాన్ని అందిపుచ్చుకునేందుకు చిరంజీవి సిద్ధమయ్యారు. ఇందుకోసం చారిత్రక గాథనే ఎంచుకున్నారు. భారతీయులకు 1857 సిపాయిల తిరుగుబాటే తొలి పోరాటమని తెలుసు.. కానీ అంతుకుముందే తెలుగు నేలపై ఓ తెలుగు స్వాతంత్య సమరయోధుడి పోరాటాన్ని పరిచయం చేయాలని చిరంజీవి డిసైడ్ అయ్యారు. టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి చేస్తున్న ఈ ప్రయత్నం గనుక సక్సెస్ అయితే బాహుబలి తర్వాత మరో తెలుగు సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఉయ్యాలవాడ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం అగ్ర నటీనటులను సంప్రదిస్తున్నారు. టాలీవుడ్ లోనే అగ్రహీరో చిరంజీవి, బాలీవుడ్ నే ఊపుఊపేసిన హీరోయిన్ ఐశ్వర్య, ఇక ఎవ్వరికీ సాధ్యంకానీ ఆస్కార్ అవార్డు పొందిన సంగీత సంచలనం రెహమాన్.. ఈ ముగ్గురు ఉయ్యాలవాడ సినిమా కోసం పనిచేయబోతున్నారని తాజా సమాచారం. ఇప్పటికే ఉయ్యాలవాడ సినిమాలో ఓ హీరోయిన్ గా నయనతార ఎంపికైంది. ఇప్పుడు ముఖ్యమైన చిరంజీవి పక్కన హీరోయిన్ కోసం బాలీవుడ్ అగ్రహీరోయిన్ ఐశ్వర్యరాయ్ ను సంప్రదించినట్టు సమాచారం. ఐశ్వర్య కూడా చిరు పక్కన నటించడానికి ఆసక్తి కనబర్చినట్టు సమాచారం. త్వరలోనే నిర్మాతలు ఈ విషయాన్ని ప్రకటిస్తారని సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆల్బమ్ లు.., హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకు సంగీతం అందించిన సంగీత సంచలనం రెహమాన్ కూడా తొలిసారి చాలారోజుల తర్వాత స్ట్రెయిట్ తెలుగు సినిమాకు సంగీతం అందించబోతున్నారు.. కాగా ఈ చిత్రానికి ‘మహావీర’ అనే టైటిల్ ను పెడుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అక్టోబర్ నుంచి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది.

To Top

Send this to a friend