జియో వాడుతున్నారా.. అయితే డేంజర్..

ప్రస్తుతం 12 కోట్ల మంది జియో వాడుతున్నారు. రోజురోజుకు సంఖ్య పెరుగుతోంది. జియో ఉచిత డేటా, వాయిస్, కాలింగ్ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. జియో దెబ్బకు ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు కుదేలవుతున్నాయి. ఇప్పటికీ దూసుకుపోతున్న జియో సంస్థకు ఇప్పుడు హ్యాకింగ్ వల్ల పెద్ద ముప్పు వచ్చిందట..

మాజిక్ ఏపీకే.కాం అనే వెబ్ సైట్ లో జియో కస్టమర్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయ్యిందనే వార్త బిజినెస్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆన్ లైన్ లో జియో కస్టమర్ల డేటా ఉందని వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరో హ్యాక్ చేసి ఓ వెబ్ సైట్ లో పెట్టారని కొంతమంది ఆ యూఆర్ఎల్ ను ట్విట్టర్ లో షేర్ చేసేశారు. ఈ డేటా బేస్ ఉల్లంఘన ఇప్పుడు మార్కెట్ వర్గాలను షేక్ చేస్తోంది.

అయితే నష్టనివారణ చర్యలు చేపట్టిన జియో.. ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. ఇవి వదంతుల అని తమ వినియోగదారుల డేటా తమ దగ్గరే సురక్షితంగా ఉందని గట్టిగా వాదిస్తోంది. ఎలాంటి డేటా లీక్ కాలేదని జియో ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ కస్టమర్ల డేటా భద్రంగా ఉందని హామీ ఇచ్చారు. కానీ జియో కస్టమర్లలో మాత్రం తమ డేటా ఎక్కడ ఆన్ లైన్ లో లీక్ అయిపోయిందోనన్న ఆందోళన నెలకొంది.

To Top

Send this to a friend