‘ఉయ్యాలవాడ’.. విలక్షణ ఉపేంద్ర..

చిరంజీవి చేసే 151వ సినిమాలో నటించే మరో స్టార్ పేరు తెరపైకి వచ్చింది. చిరంజీవి తన 151వ చిత్రంగా తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఎంచుకున్నారు. బాహుబలి రిలీజ్ అయ్యాక ఈ చారిత్రక కథలకు డిమాండ్ పెరిగింది. దేశవ్యాప్తంగా రిలీజ్ చేసి పేరుతో పాటు డబ్బు ఆర్జించవచ్చని దర్శకులు, హీరోలు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే చిరు ఉయ్యాలవాడ తీసేందుకు ముందుకు వచ్చారు.

ఇక ఉయ్యాలవాడ కథ విషయానికి వస్తే.. దేశంలో 1857 కంటే ముందే నల్లమల అడవులను కేంద్రంగా చేసుకొని బ్రిటీష్ వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కథ.. ఈ చరిత్రకు రచయితలు పరిచూరి బ్రదర్స్, సాయి మాధవ్ బుర్రా, దర్శకుడు సురేందర్ రెడ్డి కలిసి తుది కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 15 సందర్భంగా సినిమాను లాంచ్ చేయాలని చూస్తున్నారు.

అయితే చిరంజీవి పక్కన నమ్మిన బంటు, మరో స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో విలక్షణ కన్నడ నటుడు ఉపేంద్రను నటింపచేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ పాత్ర క్లైమాక్స్ లో చనిపోతుంది. ఆ వీరోచిత పాత్రలో యాక్షన్ కింగ్ ఉపేంద్ర అయితేనే బాగుంటుందని దర్శకుడు సురేందర్ భావించినట్టు సమాచారం. చిరంజీవితో చర్చించి ఈపాటికే ఉపేంద్రను కలిసి కథ వివరించినట్టు తెలిసింది. దీంతో ఉపేంద్ర కూడా చిరంజీవి ప్రెస్టిజియస్ పాత్రలో భాగం పంచుకుంటున్నట్టే కనిపిస్తోంది.

To Top

Send this to a friend