మోడీ రగిల్చాడు.. రైతులు అంటించారు

రుణమాఫీ.. యూపీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన అస్త్రమైంది. దాదాపు 27 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాన్ని.. అతి ఎక్కువ అసెంబ్లీ, ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ పార్టీ వేసిన ప్లాన్ యూపీలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.. అక్కడ అధికారాన్ని కట్టబెట్టింది. యూపీలో అధికారంలోకి రాగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యూపీ రైతులకు కేంద్రం తరఫున రుణమాఫీ చేస్తామని చెప్పడం కాక రేపింది. అదే ఇప్పుడు బీజేపీ మెడకు చుట్టుకొని మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ లో రైతుల ఆందోళనకు కారణమవుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది. అక్కడి రైతులే తమకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వంపై పోరుబాటకు దిగారు. యూపీలో గెలవడం కోసం బీజేపీ ఇచ్చిన హామీ ఇప్పుడు ఆ పార్టీ మెడకు చుట్టుకుంటోంది..

యూపీ రైతులకు రుణామాఫీ చేస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించడం.. దేశవ్యాప్తంగా చేయాలని ఆయా రాష్ట్రాలు కోరడంతో మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. యూపీ సర్కారే రుణమాఫీ చేస్తుందని తమకు సంబంధం లేదని బుకాయించింది. సరే అక్కడితే ఆగితే బీజేపీకి సేఫ్ సైడ్ లోనే ఉండేది..

కానీ కడుపు మండిన మహారాష్ట్ర , మద్యప్రదేశ్ రైతులు రోడ్డెక్కారు. రుణమాఫీ కోసం దేశంలోనే తొలిసారి మహారాష్ట్ర రైతులు సమ్మె చేపట్టారు. పాలు, కూరగాయాలు రోడ్ల మీద పారబోసి ముంబైకి కూరగాయాలు, నిత్యావసరాలు అందకుండా చేశారు. దీంతో ముంబైలో ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వం ఆందోళనలో పడింది. ఇక మధ్యప్రదేశ్ రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తుంటే పోలీసులు లాఠీచార్జి చేసి కాల్పులు జరపడం ఐదుగురు రైతులు మరణించడం జరిగిపోయింది. రైతుల్ని చంపించిన బీజేపీ సర్కారు అంటూ పతకాశీర్షికన ఈరోజు వార్తలు రావడం బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

To Top

Send this to a friend