యూపీ సీఎం నిర్ణయం: పిల్లలు సర్కారు స్కూళ్ళల్లొ..

మన చిన్నప్పుడు అంతా సర్కారు స్కూల్లో చదివినోళ్లమే.. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల సైతం సర్కారీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వారే.. మన రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ సైంటిస్టు అబ్ధుల్ కలాం కూడా ప్రభుత్వ బడినుంచి వచ్చినవారే.. వీళ్లందరూ గొప్పోళ్లు అయినా వారే.. కానీ ఇప్పడు సర్కారీ స్కూల్లో చదివితే ఎందుకు పనికిరాని అవుతున్నారు. కారణమేంటి.?

మన విద్యావ్యవస్థ గాడి తప్పింది. ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహించడంతో సర్కారీ చదువులు పడకేసాయి. ఐదారేళ్లుగా డీఎస్సీ వేయకపోవడం.. ఉన్న టీచర్లు రిటైర్ అవ్వడంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. చదువు చెప్పేవారు లేక ప్రభుత్వ బడులు పడకేశాయి. ప్రభుత్వ విధానాలు కూడా పాఠశాలల దుస్థితికి కారణం.. గవర్నమెంటు స్కూళ్లల్లో ప్రీ ప్రైమరీ లేకపోవడంతో పేద, మధ్య తరగతి వారు కూడా ప్రైవేటు పాఠశాలల వైపు మళ్లారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా సర్కారీ పాఠశాలల దుస్థితి ఇలాగే ఉంది. దీనికి కలత చెందిన యూపీ సీఎం మార్పును కోరుకున్నారు. ఎవ్వరివల్లనైతే ప్రభుత్వ బడులు అథపాతాళానికి చేరాయో వారితోనే మార్పు తీసుకురావాలనుకున్నారు. వెంటనే జీవో విడుదల చేశారు. ఇక నుంచి యూపీలో ప్రభుత్వ అధికారిగా కొనసాగుతున్న అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి. లేకపోతే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, టీఏ, డీఏలు, ఉండటానికి క్వార్టర్లు తదితర సౌకర్యాలు కోల్పోతారు. ఈ నిర్ణయం యూపీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది..

ప్రభుత్వ పాఠశాలలు ఈ దుస్థితికి రావడానికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యం అధికారుల పట్టింపులేని తనం కారణం.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా ఇదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు.. అధికారుల పిల్లలు కార్పొరేట్ పాఠశాలలకు వెళుతుండడంతో పట్టింపు కరువైంది. అందుకే యూపీ సీఎం ఆదిత్యనాథ్ వేసిన జీవోతో ఇక అధికారుల బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవాల్సిందే.. ఇలా చదవడం వల్ల ఆటోమేటిక్ గా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత, పర్యవేక్షణ పెరుగుతుంది. మెరుగైన ఫలితాలు వస్తాయి. తద్వారా పేద పిల్లలకు న్యాయం జరుగుతుంది. ఆదిత్యనాథ్ విసిరిన ఈ పాచిక ఇప్పుడు దేశవిద్యావవ్యస్థలోనే గొప్ప మార్పు తెస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

To Top

Send this to a friend