మాజీ మంత్రి కొడుకునే కాల్చేశారు.. ఎందుకు.?

హైదరాబాద్ లో మరోసారి గన్ కల్చర్ వెలుగుచూసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొడుకుపై కాల్పులు సంచలనం సృష్టించాయి. ఈ కాల్పులు ఎవరు జరిపారు..? ఎందుకు జరిపారనే విషయం తెలియరాలేదు. కానీ మంత్రి కొడుకు పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు తెలిసింది.

హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పై గుర్తు తెలియని వ్యక్తి ఈరోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో విక్రమ్ చేయి, కడుపులోకి రెండు బుల్లెట్లు దూసుకెల్లాయి.. కుటుంబ సభ్యలు గమనించి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

విక్రమ్ గౌడ్ నిన్న రాత్రి ఎవరితోనే గొడవపడ్డాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికొచ్చి పడుకున్నాడట.. శ్రావణం కావడంతో తెల్లవారు జామునే లేవగా.. పొద్దున ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విక్రమ్ తో గొడవ పెట్టుకున్న వాడే కాల్చేశాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు విచారించగా మాజీ మంత్రి ఇంట్లోని విక్రమ్ గౌడ్ గదిలో కూడా ఓ లైసెన్స్ లేని గన్ దొరకడం సంచలనం సృష్టించింది..

To Top

Send this to a friend