అయ్యవారి అసలు రంగు బయట పడుతోంది..

 

“మంచివాడిగా నటించేవాడి బుద్ధి మాంసం దగ్గర బయట పడుతుంది “ఇది ఒక ప్రముఖ తెలుగు సామెత.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖర్చు చేసిన మొత్తానికి 4 రెట్లు సంపాదించే మార్గం చూపుతానని తమ పార్టీ అభ్యర్థులకు అధికార పార్టీ పెద్ద ఉపదేశం చేసిన వీడియో అందరూ సోషల్ మీడియాలో చూసారు.ఆ ఉపదేశం తో స్ఫూర్తి పొందిన పలువురు అభ్యర్థులు తమ ఆస్తులు తనఖా పెట్టి లేదా తక్కువ ధరకు అమ్ముకొని మరీ ధనం సమకూర్చుకొని ఎన్నికల్లో ఖర్చు చేశారు. మరికొంతమంది పారిశ్రామిక వేత్తలు కూడా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం నుండి కాంట్రాక్టు లు, పారిశ్రామిక సబ్సిడీలు పొందవచ్చు అని భూరి విరాళాలు ఇచ్చారు.

ఇప్పుడు వారికి “కరోనా భూతం” కలలో కూడా నిద్ర పోనివ్వడం లేదు. ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. ఉద్యోగుల కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈ ఆర్ధిక మాంద్యం లో కొత్తగా పారిశ్రామిక వేత్తలు పరిశ్రమ లు పెట్టె అవకాశం లేదు. వారికి ప్రభుత్వం తక్కువ ధరకు భూములు ఇచ్చినా ఉపయోగం లేదు.టీడీపీ లాగా రాజధాని ఏర్పాటుని డబ్బుచేసుకొందామని,విశాఖకు రాజధాని తరలించి తాము పథకం ప్రకారం ముందే కొనుక్కున్న వేల ఎకరాల భూమికి వేల కోట్ల రూపాయల విలువలు పెరుగుతుందని వేసిన పథకం పారలేదు.ఆర్ధిక మాంద్యం వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలింది.విశాఖ కు రాజధాని ని మార్చినా కొనుగోలు చేసిన ధర కూడా రాదు. అప్పులు చేసి భూములు కొన్న సన్నిహిత పారిశ్రామిక వేత్తలు అనుయాయులు లభో దిబో అని గుండెలు బాదుకుంటున్నారు.

ఈ పరిస్థితి లో కరోనా పరీక్ష కిట్లు రెట్టింపు ధరకు కొనుగోలు గోల్ మాల్ ఆశ్చర్యం ఏముంది ?

అలాగే 5 కోట్ల మాస్క్ లు కూడా రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి.

ఇక బ్లీచింగ్ పొడి, ఆక్సిజన్ సిలిండర్లు,వెంటిలేటర్ ల కొనుగోలు లు వంటివి అవినీతికి ఆలవాలం అవుతున్నాయి అని ఆరోపణలు వస్తున్నాయి.పలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో చాటుగా మద్యం రెట్టింపు ధరలకు తరలిపోతున్నది అని వాటి వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు.

ఈ అవినీతి గురించి మాట్లాడే వారి వ్యక్తిత్వము పై బూతులతో ఎదురుదాడి ఏమి సూచిస్తున్నది ?

అంటే కరోనా వైరస్ అవినీతి పరులకు ఒక కామధేనువు గా,కల్పవృక్షం గా మారింది.అవినీతికి పాల్పడితే సహించము అని, రివర్స్ టెండరింగ్ చేస్తామని,సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి అనుమతించిన తరువాతే టెండర్లు అనుమతిస్తామని చెప్పినవన్నీ గాలి కబుర్లేనా ?
మంచివాడి లాగా నటించే వాడి అసలు రంగు బయట పడుతుందా ?
విశ్లేషణ :
జెట్టి శ్రీ మారుతీ కుమార్

To Top

Send this to a friend