మెద‌టి పాట ద‌ర్శ‌క‌ర‌త్న గారికి అంకింతం: సునీల్

 

సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన పరుచూరి కిరీటి నిర్మాత‌గా యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై నటిస్తున్న చిత్రం `ఉంగరాల రాంబాబు` ఈ సినిమా మొద‌టి సాంగ్‌ హులాలాలా హులాలాలా…ను శ‌నివారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. పాత్రికేయులంద‌రూ క‌లిసి సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌ను ఇటీవ‌ల ప‌ర‌మ‌ప‌దించిన ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావుకు అంకితం చేశారు.
ముందుగా దాస‌రి నారాయ‌ణ‌రావు గారి ప‌టానికి పూలు జల్లి ఆయ‌న ఆత్న శాంతించాల‌ని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

హీరో సునీల్ మాట్లాడుతూ – “దాస‌రిగారితో మంచి అనుబంధం ఉండేది. ఆయ‌న న‌న్నెప్పుడూ అందాల‌రాముడు అని పిలిచేవారు. ఎప్పుడైన మాన‌సిక ధైర్యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఆయ‌న ద‌గ్గ‌ర‌కెళ్ళి ఓ ప‌ది నిమిషాల పాటు కూర్చొంటే స‌రిపొయేది. ఆయ‌న ఈరోజు కూడా మా వేడుక‌కు హాజ‌రైన‌ట్లుగానే భావిస్తున్నాను. ఓ క‌మెడియ‌న్‌గా, హీరోగా మారిన త‌ర్వాత నా చిత్రాల్లో నా కామెడితో ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూ వ‌చ్చాను. అయితే ఉంగ‌రాల రాంబాబు సినిమా చేయ‌డం, ఓ అర్థ‌వంత‌మైన సినిమా చేసిన‌ట్లుగా భావిస్తున్నాను. సినిమా రెండు గంట‌ల ప‌దిహేను నిమిషాలు ప్రేక్ష‌కులు చాలా అర్థ‌వంతంగా న‌వ్వుకుంటారు. ఇలాంటి సినిమా చేయ‌డానికి కార‌ణం నిర్మాత‌లు ప‌రుచూరి కిరిటీ, ప‌రుచూరి ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్‌గారే కార‌ణం. అందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఈ సినిమాలో ప్ర‌కాష్‌రాజ్‌గారితో ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది. నాకు, ప్ర‌కాష్‌రాజ్‌గారికి మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్‌లాంటి స‌న్నివేశాలుంటాయి. ప్ర‌కాష్‌రాజ్‌గారి క్యారెక్ట‌రైజేష‌న్ గొప్ప‌గా ఉంటుంది. ప్ర‌తి మూడురోజుల‌కొక‌సారి సినిమాల్లోని మిగిలిన పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. గురువు గారికి పాత్రికేయ‌లంటే చాలా ఇష్టం. మ‌నల్ని స్టార్స్ ని చెయ్య‌టం కొసం మీడియా సోద‌రులు క‌ష్ట‌ప‌డుతుంటారు. సో వాళ్ళ‌ని ఎప్పుడూ మ‌ర్చిపోవ‌ద్దు అని నాతో అనేవారు అందుకే పాత్రికేయుల‌తో సాంగ్ విడుద‌ల చేసి ఈ సాంగ్‌ను దాస‌రిగారికి అంకిత‌మిస్తున్నాం“ అన్నారు.

ప‌రుచూరి కిరిటీ మాట్లాడుతూ – “ఈ సినిమాలో సునీల్ గారు అద్భుత‌మైన డ్యాన్స్ చేశారు. జిబ్రాన్ ఎక్స‌లెంట్ మ్యూజిక్ అందించారు. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున న‌టించిన ఈ చిత్రానికి మ్యూజిక్ః జిబ్రాన్, లిరిక్స్ః రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్, సినిమాటోగ్రఫిః సర్వేష్ మురారి, శ్యామ్ కె నాయుడు, ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వర రావు, ఫైట్ మాస్టర్ః వెంకట్, డైలాగ్స్ః చంద్ర మోహన్ చింతాడ, ఆర్ట్ః ఎ.ఎస్.ప్రకాష్, కొరియో గ్రఫిః భాను మాస్టర్, నిర్మాతః పరుచూరి కిరీటి, ద‌ర్శ‌క‌త్వంః కె. క్రాంతి మాధవ్.

To Top

Send this to a friend