ఉండవల్లి సవాల్ కు తోకముడిచిన టీడీపీ

మాది గ్రేట్.. కాదు కాదు.. మాదే.. అంటూ కాంగ్రెస్, టీడీపీ నాయకులు సై అన్నారు. మాజీ ఎంపీ, టీడీపీ తాజా ఎమ్మెల్యే సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకోవడం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించింది. పోలవరం, వట్టిసీమ.. వట్టి ప్రాజెక్టులు అని.. దాంతో టీడీపీ నేతలు సొమ్ము దోచుకుంటున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే.. దమ్ముంటే ఈ రెండు ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఏమీ చేసింది.? ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చిద్దామని.. బహిరంగ సవాల్ విసిరారు.

ఈ విమర్శలపై స్పందించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండవల్లిని కడిగిపారేశారు. పదేళ్లు అధికారంలో ఉండి పోలవరంను పూర్తి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు టీడీపీ చేస్తుంటే సహించడం లేదని విమర్శించారు. వట్టిసీమ మీకళ్ళకు కనిపించడం లేదా అని ఉండవల్లిని నిలదీశారు. పోలవరం, వట్టిసీమలపై చర్చించేందుకు తాను రెడీ అని.. ఉండవల్లి .. విజయవాడలోని దుర్గమ్మ ఆలయం వద్ద కు రావాలని సవాల్ విసిరారు.

కాగా చర్చకు సిద్ధమని విజయవాడ వచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్ ను పోలీసులు అడ్డుకొని చర్చకు అనుమతి లేదంటూ అరెస్ట్ చేశారు. ఆయన్ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఉండవల్లి-గోరంట్ల చర్చకు బ్రేక్ పడింది. టీడీపీ ప్రభుత్వ అవినీతి, నిజాలు బయటకు వస్తాయని భయపడే తనను అరెస్ట్ చేశారని ఉండవల్లి టీడీపీపై ఘాటు విమర్శలు చేయడం గమనార్హం. ఇలా ఉండవల్లి వాగ్ధాటికి భయపడే టీడీపీ తోకముడిచిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

To Top

Send this to a friend