ఉదయ్ కిరణ్, చిరు వివాదంపై..

వరుసగా మూడు చిత్రాలు హిట్.. పైగా చిరంజీవిలా స్వయం కృషితో ఇండస్ట్రీలో ఎదిగారు. దీంతో ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా మారిపోయారు. ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. కానీ చిన్న తప్పిదం ఉదయ్ కిరణ్ ను హీరో నుంచి జీరోను చేసింది. ఆ తర్వాత ఉదయ్ కు సినిమాల్లో అవకాశాలు రాకపోవడం.. వచ్చినా అవన్నీ ప్లాప్ లు కావడంతో సినిమా కెరీర్ ముగిసిపోయింది. తీవ్ర ఒత్తిడిలో సినిమాలు లేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి చిరంజీవి ఫ్యామిలీకి సంబంధం ఉందని మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి.

కానీ ఉదయ్ హీరోగా ప్లాప్ కావడానికి కారణాలేంటి? చిరంజీవితో విభాదాలు, ఉదయ్ ప్రేమ, చిరు కుమార్తెతో వివాహాం రద్దు తదితర సంచలన విషయాలను బయటపెట్టింది. ఉదయ్ అక్క శ్రీదేవీ ఒక యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ .. ‘చిన్నప్పటి నుంచి చిరంజీవిని గాడ్ ఫాదర్ గా ఊహించుకొనే ఉదయ్ కిరణ్ ఎదిగారు. వరుసగా మూడు సినిమాలు హిట్టయ్యాక చిరంజీవి ఉదయ్ ను బాగా ప్రోత్సహించారు. ఉదయ్ ఓ లేడీ జర్నలిస్ట్ ను ప్రేమించి విడిపోయాక ఆ వివాదంలోంచి చిరంజీవియే ఉదయ్ ను కాపాడారు. ఆ తర్వాత తన కూతురు సుస్మితనిచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. నిశ్చితార్థాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. అయితే ఆ తర్వాతే ఉదయ్-సుస్మిత మధ్య మనస్పర్ధలు వచ్చాయి. వారిద్దరూ కలిసి జీవించలేమని నిర్ణయించుకున్నారు. ఒకరి భావాలు, ఒకరి ఆలోచనలు మరొకరికి కలవకపోవడంతో ఇక నిశ్చితార్థం రద్దు చేసుకొని సామరస్యంగా విడిపోయారు. పెళ్లి తర్వాత బాధపడేకంటే… పెళ్లి చేసుకోకుండానే విడిపోవడం మంచిదని ఉదయ్-సుస్మిత భావించి పెళ్లి రద్దు నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలో ఎదగకపోవడం వెనుక చిరంజీవి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఉదయ్ కిరణ్ అక్క పేర్కొంది. చిరంజీవి గారు ఉదయ్ ను ఎంతో ప్రోత్సహించారు. ఉదయ్ తో కలిసి చిరంజీవి గారింటికి వెళ్లినప్పుడు మమ్మల్ని ఆయన ఎంతగానో ఆదరించి.. ఆప్యాయతలు పంచారు. చక్కగా మాట్లాడారు.’ ఉదయ్ ఆత్మహత్యకు చిరంజీవితో విభేదాలు కారణం కావు అని శ్రీదేవి స్పష్టం చేసింది.

To Top

Send this to a friend