టీవీ9 కొనుగోలుకు బీజేపీ టీవీ..

అర్నబ్ గోసామీ తెలుసు కదా.. అప్పట్లో ఇండియా టుడే, టైమ్స్ నౌకు ఎడిటర్ గా, న్యూస్ యాంకర్ గా షోలు నిర్వహిస్తూ చర్చల్లో రాజకీయ నాయకులను ముప్పుతిప్పలు పెట్టే మనిషి. అలాంటి మనిషి తర్వాత మోడీ దయతో బీజేపీ నేతలు పెట్టిన రిపబ్లికన్ టీవీకి ఎడిటర్ కం సీఈవో అయ్యాడు. ఈ బీజేపీ పెట్టుబడులు పెట్టిన రిపబ్లికన్ టీవీ ఇప్పుడు విస్తరణ బాటలో పడిందట.. అందులో భాగంగా ఇప్పటికే అమ్మకానికి పెట్టిన టీవీ9పై దాని కన్ను పడిందని సమాచారం.

టీవీ9లో మెజార్టీ వాటా ఉన్న శ్రీనివాసరాజు ఇప్పటికే ఈ టీవీని అమ్మాలని కొద్దికాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట జీ గ్రూప్ టీవీ9 ను కొనుగోలు చేయనుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత టైమ్స్ గ్రూపు కొంటామంది.. అదీ వర్కవుట్ కాలేదు. టీవీ18 కూడా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇప్పుడు తాజాగా అర్నబ్ గోస్వామి నేతృత్వంలోని రిపబ్లిక్ టీవీ.. అన్ని భాషల్లో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన టీవీ 9 కొనుగోలుకు చర్చలు ప్రారంభించిందనే వార్త వెలువడుతోంది.

అయితే టీవీ9 అమ్మకం వార్తలు వచ్చినప్పుడల్లా దానిలో 70శాతానికి పైగా వాటాదారు అయిన పారిశ్రామికవేత్త శ్రీనివాసరాజు ఇది నిజమేనని ఒప్పుకుంటుండడా.. టీవీ9 సీఈవో రవిప్రకాశ్ మాత్రం ఈ వార్తలు ఖండిస్తున్నాడు. కానీ ఇప్పుడు శ్రీనివాసరాజు మాత్రం టీవీ9 అమ్మకానికి సంప్రదింపులు జరుగుతున్నట్టు ఓ జాతీయ న్యూస్ చానల్ కు వెల్లడించడం గమనార్హం. ఇలా టీవీ9 కొనుగోలు ప్రక్రియ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.

To Top

Send this to a friend