బాహుబలిని క్రాస్‌ చేస్తుందన్నారు…తుస్‌మంది


సల్మాన్‌ ఖాన్‌ గత కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. చేసిన ప్రతి సినిమా కూడా వందల కోట్లు కలెక్షన్స్‌ను సాధిస్తుంది. తాజాగా సల్మాన్‌ విభిన్నమైన పాత్రలో ‘ట్యూబ్‌లైట్‌’ అనే చిత్రాన్ని చేశాడు. ఇండియా, పాకిస్తాన్‌ బోర్డర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇండియన్‌ ఆర్మీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా రంజాన్‌ సందర్బంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బాలీవుడ్‌లో బాహుబలి సాధించిన కలెక్షన్స్‌ను ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రంతో సల్మాన్‌ ఖాన్‌ సునాయాసంగా బ్రేక్‌ చేయడం ఖాయం అని అంతా భావించారు. కాని సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా రివర్స్‌ అయ్యింది. ప్రేక్షకుల నుండి నెగటివ్‌ టాక్‌ను సల్మాన్‌ పొందుతున్నాడు. ఏమాత్రం ఆకట్టుకోని స్క్రీన్‌ప్లేతో పాటు సల్మాన్‌ ఖాన్‌ను అలా చూడటం ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంది. అందుకే సినిమాకు నెగటివ్‌ టాక్‌ ప్రారంభం అయ్యింది.

‘బాహుబలి 2’ కలెక్షన్స్‌ను క్రాస్‌ చేస్తుందనుకున్న ‘ట్యూబ్‌లైట్‌’ ఇప్పుడు కనీసం బడ్జెట్‌ను అయినా రికవరీ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సల్మాన్‌ ఖాన్‌ ఇటీవల నటించిన దాదాపు అన్ని సినిమాలు 250 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ వస్తున్నాయి. మరి ఈ సినిమా ఆ స్థాయి వసూళ్లను కూడా సాధించడం అనుమానమే అని అప్పుడే ట్రేడ్‌ పండితులు అంటున్నారు.

To Top

Send this to a friend