ట్యూబ్ లైట్ ఆగయా..

మరోసారి దేశభక్తి చిత్రంతోనే సల్మాన్ ఖాన్ మన ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే భజరంగీ భాయ్ జాన్ సినిమాతో ఇండో పాక్ మధ్య సున్నిత అంశాలు.. ప్రజల సంఘర్షణను కళ్లకు కట్టినట్టు చూపిన దర్శకుడు కబీర్ ఖాన్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు విడుదలైన సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘ట్యూబ్ లైట్’ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది..

హిస్టారికల్ వార్ డ్రామాగా.. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం నేపథ్యంలో సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో చైనా అమ్మాయిని ప్రేమించే యువకుడిగా సల్మాన్ నటిస్తున్నాడు. ఈ యుద్ధంలో ప్రేమ జంట ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారన్నది అసలు స్టోరీ.. టీజర్ కు దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ప్రీతమ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని ఈద్ సందర్భంగా విడుదల చేయనున్నట్టు చిత్రం బృందం తెలిపింది.

ట్యూబ్ లైట్ మూవీ టీజర్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend