ఉద్యోగం వద్దంటే రూ.5 లక్షలు

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు కోసం ఓ మరో వినూత్న ఫ్యాకేజీని ప్రవేశ పెట్టింది. వారసత్వ ఉద్యోగం వద్దు అనుకునే కుటుంబానికి ఇచ్చే అదనపు ఆర్థికసాయాన్ని ఆర్టీసీ రూ.5 లక్షలకు పెంచింది. ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగిపై ఆధారపడిన అతని కుటుంబసభ్యులు తమకు వారసత్వ ఉద్యోగం అక్కరలేదని రాతపూర్వకంగా తెలియజేస్తే వారికి ఈ ప్రయోజనం దక్కుతుంది.

కొంతకాలంగా సంస్థలో పెండింగ్‌లో ఉన్న ఈ విషయమై తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు సర్క్యులర్ జారీచేశారు. వారసత్వ ఉద్యోగం వద్దన్న చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ ఇప్పటివరకు ఆ ఉద్యోగి క్యాటగిరీని బట్టి రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు అదనపు ఆర్థికసాయం కింద ఇస్తుంది. క్లాస్-3, 4 ఉద్యోగులకు రూ.లక్ష, క్లాస్-2కు రూ.1.25 లక్షలు, క్లాస్-1 వారికి రూ.1.50 లక్షల చొప్పున అందజేస్తోంది. ఇప్పుడు ఈ మొత్తం రూ.5 లక్షలకు పెంచింది.

ఏ తరగతి ఉద్యోగికైనా అందరికీ ఒకేవిధంగా ఇంతే మొత్తాన్ని అందిస్తామని…ఈ సహాయం ఈ నెల 4 నుంచి చనిపోయిన ఉద్యోగుల కుటుంబీకులకు మాత్రమే వర్తిస్తుందని ఎండీ సర్క్యులర్‌లో వివరించారు.

To Top

Send this to a friend