తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకానికి 23న డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుంది. ఉపాధ్యాయ నియామకానికి సంబంధించిన విధి విధానాలను పాఠశాల విద్యా శాఖ 17న రూపొందించనుంది. ఆ వివరాలను 18న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపించనుంది. శుక్రవారం పాఠశాల విద్యా శాఖ అధికారు లతో ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సమీక్ష నిర్వ హంచారు. ఈ సమీక్షలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఎలా భర్తీ చేయాలనే దానిపై చర్చించారు. రిజర్వే షన్ల ప్రక్రియ, రోస్టర్ విధానం, నియామకాలు కొత్త జిల్లాల వారీగానా, పాత జిల్లాల ప్రకారం చేపట్టాలా? అనే అంశాలపై చర్చించినట్టు సమా చారం. వీటితోపాటుగా జిల్లాల వారీగా ఖాళీల వివరా లను సేకరించి తద్వారా నియామకాలను చేపట్ట నున్నారు.
ఉపాధ్యాయ నియామకానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకోవాలని భావిస్తోంది. గతంలో గురుకుల టీచర్ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఈ సారి అలా కాకుండా జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి నిబంధనల మేరకు టీచర్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. ఉపాధ్యాయ టీచర్ పోస్టుల భర్తీ కోసం పాఠశాల విద్యా శాఖ రూపొందించిన విధి విధానాల జాబితా(ఇండెంట్)ను 18న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపిం చనున్నారు.
ఉపాధ్యాయ నియామక ప్రక్రియను గతంలో మాదిరిగా డీఎస్సీ పేరుతో నిర్వహిస్తారా? టీచర్ రిక్రూట్మెంట్ పేరుతో నిర్వహిస్తారా? అనేది కూడా నిర్ణయించనున్నారు.
టిఎస్పిఎస్సీకి పాఠశాల విద్యా శాఖ వివరాలను పంపించిన అనంతరం వాటిని పరిశీ లించి 23న నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నోటిఫికేషన్‌తోపాటే సిలబస్‌ను కూడా పబ్లిక్ సర్వీస్ కమిషనే నిర్ణయించనుంది. నోటిఫికేషన్ జారీ అయిన తరువాత ఎవరూ కూడా కోర్టులకు వెళ్లకుండా ఉండేలాగా అన్ని రకాల జాగ్రత్తలను సర్కార్ తీసు కుంటోంది. ఇందుకోసం సాధారణ పరిపాలన శాఖ అనుమతి కూడా తీసుకోనుంది. 8972 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది
