మరోసారి చిక్కుల్లో పడ్డ అమెరికా అధ్యక్షుడు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. యూరప్ లోని బ్రసెల్స్ లో జరుగుతున్న నాటో సదస్సుకు హాజరైన ట్రంప్.. అనంతరం జరిగిన ఫొటో సెషన్స్ లో మాంటినిగ్రో దేశ అధ్యక్షుడిని పక్కకు తోసి తాను ముందు వచ్చి నిలబడడం వివాదాస్పదమైంది.. దేశ అధ్యక్షుడు మార్కోవిక్ తోసేయడాన్ని అన్ని మీడియా సంస్థలు బ్రేకింగ్ న్యూస్ గా ప్రసారం చేయడంతో ట్రంప్ పరువు పోయింది.

ట్రంప్ చేష్టలు జాతీయ చానళ్లు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రంప్ తమ దేశాధ్యక్షుడిని నెట్టివేయడంపై మాంటినిగ్రో ప్రజలతో పాటు బాల్కన్ దేశాల ప్రజలు నిరసన తెలిపారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనంత మాత్రాన ప్రపంచ సదస్సులపై మొదటి స్థానంలో నిలబడే రూల్ ఏమీ లేదని బీబీసీ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు తూర్పార పట్టాయి..

ఈ వివాదంపై మాంటినిగ్రో అధ్యక్షుడు కూడా స్పందించాడు. ట్రంప్ చేసింది తప్పు కాదని స్పష్టం చేశారు. నాటో కానీ మరే ఇతర సదస్సుల్లో కూడా అమెరికా అధ్యక్షుడు ముందు వరుసలో నిలబడడం సర్వసాధారణ విషయమని స్పష్టం చేశారు.

To Top

Send this to a friend