మంత్రిది నోరా.. పెంటా కుప్పా..

బాధ్యతగల మంత్రి హోదాలో ఉండి ఒక ఉద్యమకారుడిని బండబూతులు తిట్టిన వ్యవహారం తెలంగాణలో సంచలనం రేపుతోంది.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు పట్టణం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కావాలని జేఏసీ ఉద్యమకారుడు ముంజాల భిక్షపతి పోరాడుతున్నారు. అడపాదడపా ములుగులో నలుగురిని పోగేసి ఉద్యమిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ఆ జిల్లాకు చెందిన మంత్రి, పర్యాటక, గిరిజన శాఖ మంత్రి చందూలాల్ శివాలెత్తారు.

‘పేగులెల్తాయ్. లం.. కొడుకా.. గాడిద,, అంటూ రాయలేని రీతిలో సదురు ఉద్యమకారుడికి ఫోన్ చేసి తిట్ల వర్షం కురిపించారు. ‘నీవు జిల్లా సాధించే మొగోడివి అయినావా.. నీవెంత .. నీ బతుకెంత’ అంటూ దుర్భాషలాడారు. మంత్రి తిట్ల పురాణం రికార్డు చేసిన ఉద్యమకారుడు భిక్షపతి దాన్ని మీడియాకు విడుదల చేయడంతో విషయం వెలుగుచూసింది.

చందూలాల్ వ్యవహారం మీడియాలో ప్రముఖంగా రావడంతో ఆయన్ను విలేకరులు ప్రశ్నించగా అందుబాటులోకి రాలేదు. ఇక ఉద్యమకారుడు భిక్షపతి ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ మధ్య మంత్రులు, ఎమ్మెల్యేల అతి… ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకొస్తోంది..

మంత్రి చందూలాల్ మాట్లాడిన బండబూతులను కింద లింక్ లో చూడొచ..

To Top

Send this to a friend