సౌత్‌ ఇండియా సూపర్ స్టార్ రాజకీయంపై చర్చ…

గత 10 సంవత్సరాలుగా సౌత్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఎప్పటికప్పుడు తన పొలిటికల్‌ ఎంట్రీ వార్తలను రజినీకాంత్‌ కొట్టి పారేస్తూ వచ్చాడు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో తమిళనాట రాజకీయ అనిశ్చితి మరియు రాజకీయ శూన్యత ఏర్పడటం జరిగింది.

జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీకి అక్కడ ఛాన్స్‌ లేదు. ఇక అమ్మ మరణంతో అన్నాడీఎంకే పార్టీ కోలుకోలేని పరిస్థితుల్లో కూరుకు పోయింది. వచ్చే ఎన్నికల సమయానికి అంతర్ఘత సంఘర్షణలతో పార్టీ మొత్తం నాశనం కావడం ఖాయం. ఇక డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయన తనయుడు స్టాలిన్‌కు పార్టీని తండ్రి స్థాయిలో నడిపించే సత్తా లేదు. దాంతో తమిళనాట ఈ సమయంలో పార్టీ పెడితే తప్పకుండా ప్రయోజనం ఉంటుందని రజినీకాంత్‌ భావిస్తున్నారు.

మొదట బీజేపీలో రజినీకాంత్‌ చేరి తమిళనాట బీజేపీ జెండా ఎగుర వేస్తారని అంతా అనుకున్నారు. కాని తమిళనాట ఎప్పుడైనా కూడా ప్రాంతీయ పార్టీలదే హవా. ఆ కారణంగానే రజినీకాంత్‌ సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. సొంత పార్టీ నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికి అతి త్వరలోనే ఆ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తమిళ సినీ వర్గాల వారు మాత్రమే కాకుండా సౌత్‌ ఇండియా మొత్తం కూడా ఇప్పుడు రజినీకాంత్‌ రాజకీయం గురించి చర్చించుకుంటున్నారు. రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే రాణించగలరా అనేది చూడాలి.

To Top

Send this to a friend