జగన్ ఎటు..?

ఎట్టి పరిస్థితుల్లో 2019లో గెలుపే లక్ష్యంగా జగన్ ముందుకెళ్తున్నారు. ఇందుకోసం దాదాపు 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ను ఢిల్లీ నుంచి రప్పించారు. ఆయన బృందం ఇదివరకే ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పార్టీ బలం, బలగం, ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడుతారనే దానిపై సర్వే నిర్వహించిందట. ఇందులో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయిందని సమాచారం. 2014 ఎన్నికల్లో గెలిచిన వారిలో దాదాపు 25మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ మైనస్ లో పడిపోయిందని సమాచారం. ఈ నేపథ్యంలో వారందరికీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వడం అనుమానమే అన్న చర్చ సాగుతోంది.

ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లో నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. జగన్ సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యేల జాతకాలు విశ్లేషించారు. ఈ మేరకు శనివారం నిర్వహించే వైసీపీ ప్లీనరీలో పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు వైసీపీలో ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ప్రశాంత్ కిషోర్ నిర్ణయాలను అమలు చేసి 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న జగన్ ఈ మేరకు వ్యతిరేకత ఉన్న 25మంది వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని డిసైడ్ అయినట్టు సమాచారం. దీంతో వారందరూ టీడీపీ గూటికి చేరుతారా.? లేక అసమ్మతి రాజేస్తోందా అన్నది వైసీపీలో గుబులు రేపుతోంది. ప్రశాంత్ సూచనలను పాటించకపోతే గెలవడం కష్టం.. పాటిస్తే వైసీపీ లో అంతర్యుద్ధం… ఈ నేపథ్యంలో ఏం చేస్తే బాగుంటుందనే దానిపై జగన్, వైసీపీ ముఖ్యులతో కలిసి తల బద్దలు కొట్టుకుంటున్నట్టు సమాచారం.

To Top

Send this to a friend