గుండు కొట్టించుకోనుంది


సినీ పరిశ్రమ అంటే గ్లామర్‌ పరిశ్రమ. ఇక్కడ గ్లామర్‌గా, అందంగా ఉంటేనే రాణించగలరు. అది లేకుండా రాణించడం దాదాపు అసాధ్యం. అయితే కొందరు హీరోలు మాత్రం కొన్ని సందర్బాల్లో అందంగా కాకుండా అంద వికారంగా కనిపిస్తూ ఉంటారు. అయితే తెలుగు హీరోలు మాత్రం డీ గ్లామర్‌గా నటించేందుకు అస్సలు ఒప్పుకోరు. ఇక హీరోయిన్స్‌ కూడా వెయ్యిలో ఒక్కరు తప్ప ఏ ఒక్కరు కూడా డీ గ్లామర్‌గా నటించేందుకు ఆసక్తి చూపించరు. అయితే పూర్ణ మాత్రం అందరికి షాక్‌ ఇస్తుంది.

తెలుగులో ‘సీమటపాకాయ్‌’, ‘అవును’తో పాటు ఇంకా పలు హర్రర్‌ చిత్రాల్లో నటించిన పూర్ణ త్వరలో ఒక సినిమా కోసం ఏకంగా గుండు కొట్టించుకునేందుకు సిద్దం అవుతుందట. మామూలుగా అయితే హీరోలు లేదా హీరోయిన్స్‌ గుండుతో కనిపించాలంటే గుండు వంటి విగ్గును ధరిస్తారు. కాని పూర్ణ మాత్రం ఏకంగా గుండును కొట్టించుకోవాలని నిర్ణయించుకుంది. సినిమాలో మెజార్టీ భాగం గుండుతోనే కనిపించనుందట. దాంతో పాటు సినిమాలో గుండుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే గుండు కొట్టించుకుని పాత్రను మరింతగా రక్తి కట్టించాలని ఆమె భావిస్తుంది.

పూర్ణతీసుకున్న నిర్ణయం సినీ వర్గాల వారికి షాకింగ్‌ అని చెప్పాలి. ఒక అమ్మాయి గుండు కొట్టించుకుంటే జుట్టు మునుపటి రూపంలోకి రావాలి అంటే కనీసం ఆరు నెలలు లేదా ఏడు నెలలు పడుతుంది. అప్పటి వరకు పూర్ణ మరో సినిమా చేయదా, లేక జట్టును విగ్‌తో కవర్‌ చేస్తుందా అనేది చూడాలి.

To Top

Send this to a friend