తూర్పు తీరంలో యుద్ధమేఘాలు..


నరహంతకుడు ఆ దేశాధ్యక్షుడు.. అధికారం కోసం ఏకంగా సొంత కుటుంబ సభ్యలనే హతమర్చాడు. తన పదవికి ఎసరు తెస్తున్నాడని.. సొంత మామనే కుక్కలకు ఆహారంగా వేసిన రాక్షసుడు.. మంత్రివర్గంలో తన మాటలకు నవ్వాడని ఏకంగా మంత్రి ని ఉరితీసిన కుర్ర అహంబావి.. దేశంలో సైన్యాన్ని రక్షణ పెట్టుకొని ఎన్నో అక్రమాలు, హత్యలకు పాల్పడుతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన గోతిని తానే తవ్వుకున్నాడు.

ఉత్తరకొరియా తాజాగా వరుసగా క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది. ఇటీవల తక్కవ దూరం శ్రేణి గల క్షిపణులను విజయవంతంగా ప్రయోగించిన ఉత్తరకొరియా శాస్త్రవేత్తలు.. అమెరికా టార్గెట్ గా ఖండాతార క్షిపణి పరీక్ష శనివారం చేయగా అది విఫలమైంది. ఇది గనుక విజయవంతం అయితే అది అమెరికాకు పెనుముప్పుగా మారి ఉండేది. ఎందుకంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ అమెరికా టార్గెట్ గానే ఆ క్షిపణి పరీక్ష చేసినట్టు ఆదేశ రక్షణ వర్గాలు తెలిపాయి. కానీ విఫలం కావడంతో అమెరికా సహా పక్కనున్న దక్షిణ కొరియా, జపాన్ లు ఊపిరి పీల్చుకున్నాయి.

ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు.. ఆయుధ సంపత్తి సంపాదించుకోవడం వెనుక చైనా ఉన్నట్టు అమెరికా ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. కొరియా అంతా సత్తా లేకున్నా చైనా రహస్యంగా క్షిపణి తయారీ ప్లాన్ ను ఉత్తరకొరియాకు అందజేసిందని ఆరోపణలున్నాయి. అందుకే ఇప్పుడు క్షిపణలు తయారు చేసి కొరియా ప్రపంచానికే సవాలు విసురుతోంది..

కాగా ఉత్తరకొరియా క్షిపణుల ప్రయోగాల నేపథ్యంలో అమెరికా అలెర్ట్ అయ్యింది. తన యుద్ధనౌకలను దక్షిణ కొరియా సరిహద్దుల్లో మోహరించింది. దానిపై యుద్ధ విమానాలను సిద్ధం చేసింది. దక్షిణ కొరియా మీద ఉత్తరకొరియా దాడికి దిగితే వెంటనే తిప్పికొట్టడానికి దక్షిణకొరియా-అమెరికా సన్నద్ధంగా ఉన్నాయి. దీంతో తూర్పు తీరంలో ప్రస్తుత యుద్ధవాతావరణం నెలకొంది.

To Top

Send this to a friend