బ్రహ్మీ ఆస్తుల గొడవ ఇప్పుడెందుకు?


గత రెండు రోజులుగా తెలుగు వెబ్‌ మీడియాలో బ్రహ్మానందం ఆస్తుల గురించి తారా స్థాయిలో చర్చ జరుగుతుంది. ఒక ఇంగ్లీష్‌ పత్రిక కథనంలో బ్రహ్మానందంకు 320 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది. అప్పటి నుండి కూడా బ్రహ్మానందం ఆస్తుల గురించి కుప్పలు తెప్పలుగా కథనాలు వస్తున్నాయి. బ్రహ్మానందం ఆస్తులు ఆ రేంజ్‌లో ఎలా ఉన్నాయి, అంతగా ఆస్తులు ఎలా సంసాదించాడు అంటూ పెద్ద ఎత్తున చర్చ ప్రారంభం అయ్యింది. అయితే బ్రహ్మానందం ఆస్తుల గురించి ఇంత చర్చ, ప్రచారం అవసరం లేని విషయం.

బ్రహ్మానందం ఇండస్ట్రీకి వచ్చి నాలుగు దశాబ్దాలు అయ్యింది. ఆ సమయంలో ఒక స్టార్‌ హీరో స్థాయిలో బ్రహ్మానందం సినిమాలు చేశాడు. వెయ్యి సినిమాల్లో నటించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును దక్కించుకున్నాడు. అటువంటి స్టార్‌ కమెడియన్‌ ఆస్తులు 320 కోట్లు ఉండటం పెద్ద లెక్కేం కాదు. బ్రహ్మానందం మూడు నాలుగు సంవత్సరాల క్రితం రోజుకు లక్షకు పైగా పారితోషికం తీసుకునేవాడు. ఎన్నో సినిమాలకు భారీ పారితోషికాన్ని అందుకున్నాడు. అలాంటి బ్రహ్మానందం ఆపాటి ఆస్తులు కూడగట్టలేడా. అప్పట్లో ఆస్తులు తక్కువ రేటుకు కొని వేసినా ఇప్పుడు వాటి విలువ ఎక్కువ అవుతాయి. అసలు బ్రహ్మానందం ఆస్తుల విలువ 500 కోట్లకు పైగానే ఉంటుంది. బ్రహ్మానందం అక్రమంగా సంపాదించి ఉంటే ఇంకా ఎక్కువ ఉండేది, బ్రహ్మీని ఆస్తుల పేరుతో కొందరు అనుమానిస్తూ, అవమానిస్తున్నారు. ఇప్పటికైనా బ్రహ్మీ ఆస్తుల గొడవ ఆపేస్తే బాగుంటుంది.

To Top

Send this to a friend