డ్రగ్స్‌ కోసం అల్లాడిపోతున్న టాలీవుడ్‌ స్టార్స్‌

ఒక్కసారి డ్రగ్స్‌కు అలవాటు పడ్డవారు వెంటనే మానేయడం అంత సుభమైన విషయం కాదు. సినిమాల్లో చూపినంత దారుణంగా ఉండదు కాని, డ్రగ్స్‌కు అలవాటు పడ్డ వారు పదే పదే కావాలని కోరుకోవడంతో పాటు, అది లభించకుంటే ఏదో కోల్పోయిన వారి మాదిరిగా మారిపోతారు. కొందరు మానసికంగా కూడా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమయానికి డ్రగ్స్‌ను తీసుకోకుంటే వారిలో షివరింగ్‌ వచ్చేస్తుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో పలువురి పరిస్థితి ఇదే అంటూ విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

టాలీవుడ్‌ సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ను సరఫరా చేసే కెల్విన్‌ అరెస్ట్‌ అవ్వడంతో టాలీవుడ్‌ సెలబ్రెటీలు డ్రగ్స్‌ లభించక అల్లాడిపోతున్నారు. ఒక ప్రముఖ హీరో మరియు కొందరు నటీనటులు కూడా డ్రగ్స్‌ లేక మానోవేదన అనుభవిస్తున్నట్లుగా వారి సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే ముగ్గురు డ్రగ్స్‌ లేకపోవడంతో అనారోగ్యం పాలయ్యారు అనే టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో వారికి రహస్యంగా చికిత్స చేయిస్తున్నారు. ఇంకా ముందు ముందు డ్రగ్స్‌ లేక మరింత మంది అల్లాడిపోతారనే టాక్‌ వినిపస్తుంది.

To Top

Send this to a friend