రవితేజ, పూరి, చార్మి డ్రగ్స్ బానిసలట..

 

అనుకున్నంత అయ్యింది. తెలుగు సినిమా ఇంటస్ట్రీతో డ్రగ్స్ మాఫియాకు లింకులు ఉన్నాయని తేలిపోయింది. తెలంగాణ పోలీసులు డ్రగ్స్ మాఫియాను పట్టుకొని విచారించగా వారు తెలుగు సినిమా రంగంలో డ్రగ్స్ వాడుతున్న వారి పేర్లను బయటపెట్టారు. ఈ జాబితా ఆధారంగా తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడే ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. వారందరికీ నోటీసులు జారీ చేసింది.

డ్రగ్స్ వాడుతున్న తెలుగు సినీ ప్రముఖులందరినీ ఈ నెల 19 నుంచి 27 వరకు వారందరినీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే వీరందరినీ గుర్తించి నోటీసులు పంపించారు. వారం పాటు వీరందరినీ పోలీసులు ప్రశ్నించి ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు..? డ్రగ్స్ ముఠాలతో సంబంధాలపై ఆరాతీయనున్నారు. టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు జారీ కావడంతో ఇండస్ట్రీ అంతా షాక్ కు గురి అయ్యింది. మా అసోసియేషన్ ప్రముఖులు దీనిపై చర్చించారు. అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, మా అధ్యక్షుడు శివాజీ రాజా సహా చాలామంది దీనిపై సమాలోచనలు జరిపారు.

ఈ డ్రగ్స్ వాడుతున్న వారిలో తెలుగులో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉండడం విస్తుగొలుపుతోంది. పోలీసులు పంపిన నోటీసుల జాబితా ప్రకారం ప్రముఖ హీరో రవితేజ, ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మితో పాటు హీరోలు తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజులు ఉన్నారు. ఇక
హీరోయిన్ల విషయానికి వస్తే చార్మి, ముమైత్ ఖాన్ లు ఉన్నారు. వీరితోపాటు కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, రవితేజ కార్ డ్రైవర్ శ్రీనివాసరావు కూడా డ్రగ్స్ తీసుకుంటున్న జాబితాలో ఉన్నారు. వీరందరికీ నోటీసులు పంపిన అధికారులు డగ్ర్స్ లింకులపై ప్రశ్నించేందుకు సమాయత్తమయ్యారు.

To Top

Send this to a friend