మహేశ్, ఎన్టీఆర్ లు జర మారండయ్యా..

దేశం మొత్తం మీద రిలీజ్ అవుతున్న సినిమాల సక్సెస్ రేటు ఈ మధ్యకాలంలో 10శాతం కూడా మించడం లేదని టాక్. అయితే తెలుగు, తమిళనాట మాత్రం సక్సెస్ రేటు 25శాతానికి పైగానే ఉంటుంది. తమిళంలో అయితే ఇంకొంచెం ఎక్కువే.. అక్కడ హీరోలు, దర్శకులు చేసే కథలు చాలా వైవిధ్యంతో కూడుకున్నవి ఉంటాయి. అందుకే తెలుగులో కంటే తమిళంలోనే విజయాల శాతం కాస్త ఎక్కువ.

ఇంతటి క్లిష్ట సినిమా పరిస్థితులున్నప్పుడు హీరోలు ఏం చేయాలి.. కాస్త ఆలోచించాలి. అగ్రహీరోలు మంచి కథా కథనం సినిమాలు తీయాలి. ఒకేసారి రిలీజ్ చేయకుండా చాలా గ్యాప్ తో తీస్తే ప్రేక్షకులు చూస్తారు. కాసిన్ని డబ్బులు మిగులుతాయి. కానీ మొండి పట్టుదలతో ఒకేసారి సినిమాలు రిలీజ్ చేస్తూ అటు డబ్బులు రాకుండా.. ఇటు ప్రేక్షకులు చూడకుండా చేసుకుంటున్నారు..

ఇప్పుడు మహేశ్ బాబు, ఎన్టీఆర్ సినిమాలు కూడా దసరా కానుకగా సెప్టెంబర్ 27కు కాస్త అటూ ఇటుగా రిలీజ్ చేస్తామని ప్రకటించడం వివాదాస్పదమైంది. టాలీవుడ్ లో అగ్రహీరోలు ఇలా రిలీజ్ చేసుకోవడం కలెక్షన్లపై ప్రభావం చూపుతుంది. నిర్మాతలు మునిగిపోతారు. ఈ విషయంలో తమిళనాట మంచి సంప్రదాయం ఉంది. అక్కడ హీరోలు కనీసం 15రోజుల గ్యాప్ తో సినిమాలు విడుదల చేసుకుంటూ మంచి సమన్వయంతో ముందుకెళ్తారు. తెలుగులో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఎన్టీఆర్, మహేశ్ మొండిపట్టుదలతో దసరాకు ఇద్దరూ రిలీజ్ చేయకుండా ఎవరైనా ఒకరు డ్రాప్ అయితే నిర్మాత, ప్రేక్షకులకు, ఇండస్ట్రీకి మంచిదనడంలో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend