బిగ్ బాస్ ను రక్షించడానికి..

ఎన్టీఆర్ హోస్ట్ గా మాటీవీలో ప్రారంభమైన బిగ్ బాస్ షో ఆశించనంత మేర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అందులో పేరున్న సెలబ్రెటీలు లేకపోవడమే ఆ షో ప్లాప్ అవడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫేమస్ హీరో, హీరోయిన్ ఒక్కరూ లేకపోవడం ఈ షోకు మైనస్ గా మారింది. ముమైత్ ఖాన్ తప్పితే ఫేమస్ క్యారెక్టర్ అక్కడ లేరు. దీంతో షో చూడడానికి కూడా జనం ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కు మరింత క్రేజ్ తెచ్చేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొంత మంది స్పైసీ వ్యక్తులను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ముఖ్యంగా హాట్ యాంకర్ అనసూయ ఈ బిగ్ బాస్ షోలో పాలుపంచుకోవాలని ఆమెను సంప్రదించినట్టు సమాచారం.

యాంకర్ అనసూయ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. తెలుగు చానల్స్ లో వివిధ షోలకు యాంకరింగ్ చేస్తోంది. బిగ్ బాస్ షోకు క్రేజ్ తీసుకురావడానికి ఈ షోలో ఓ వారం ఉండేలా అనసూయను ఒప్పించి ఎంట్రీ ఇప్పించాలని ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట.. అలాగే నటి, యాంకర్ తేజస్వీ మదివాడ కూడా ఈ షోలోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

ఇక ఫేమస్ నటి మంచు లక్ష్మీని కూడా గెస్ట్ గా తీసుకురావాలని సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ఇలా వచ్చే వారంలో చాలా మంది సెలబ్రెటీలు బిగ్ బాస్ హౌస్ లోకి మారిపోవడం ఖాయం అంటున్నారు షో నిర్వాహకులు.. ఈ నేపథ్యంలోనే షోలోకి వైల్డ్ కార్డ్ ద్వారా కొంతమంది సెలబ్రెటీలను పంపాలని చర్చలు జరుపుతున్నారు. దీంతో వచ్చేవారం బిగ్ బాస్ రక్తికట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

To Top

Send this to a friend