తిరుమలేషుడు సామాన్యులకే.. వీఐపీలకు కాదు..

తిరుమలేషుడి దర్శనం ఇక సామాన్యులకే కలుగనుంది. మంత్రి, ఉన్నతాధికారులు, ఇతర వీఐపీలు స్వయంగా దర్శనానికి వస్తేనే బ్రేక్ దర్శనం.. వారి బంధుగణం, ఇతరులు వీఐపీ సిఫారసు లేఖలు తెచ్చినా వారి నో దర్శనం.. వేసవి రద్దీ కారణంగా టీటీడీ ఈవో తీసుకున్న ఈ నిర్ణయంతో వీఐపీలు , వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. సామాన్యులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి వేసవి లాగే ఈ వేసవిలో కూడా రద్దీ పెరిగిపోయింది. క్యూలల్లో తొక్కిసలాట జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత నెల 7 నుంచి జూన్ 11 వరకు పదివారాలు.. వీకెంట్ 3 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. గడిచిన 12 రోజులుగా రద్దీ పెరగిపోవడం.. ఎండలు మండుతుండడంతో క్యూల్లో భక్తులు , పిల్లలు, వృద్దులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. దీంతో గత 12 రోజులుగా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం వీఐపీలు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శనం కేటాయిస్తారు. అదీ కూడా వీఐపీతో కలిపి ఆరుగురిని మాత్రమే అనుమతిస్తున్నారు. దానివల్ల అరగంటలో బ్రేక్ దర్శనాలు ముగిసి భక్తులకు ఊరట కలుగుతోందట..

ఈ పరిణామాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి మంత్రులు, ఉన్నతాధికారులు సహా అందరినీ ఒకే గాటన కట్టడం.. మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ ల సిఫారసు లేఖలను బుట్టదాఖలు చేయడంపై భక్తులు సంతోష పడుతున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా తిరుమలేషుడు భక్తలు పక్షాన నిలిచారని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

To Top

Send this to a friend