ఇలాచేస్తే కడుపులో గ్యాస్టిక్ సమస్యలు సులువుగా తగ్గిపోతాయి!!

సకాలంలో తినకపోవడం, అస్తవ్యస్థమైన జీవన విధానంతో ఇప్పుడు అందరికీ గ్యాస్టిక్ సమస్యలు కామన్ అయిపోయాయి. ప్రారంభంలోనే గ్యాస్టిక్ సమస్యలను నివారించుకోకుంటే.. తీవ్రమైన కడుపులో మంటలు, అల్సర్లు, పేగుపూత వంటి ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తాయి. కింద చెప్పిన విధంగా వంటింటిలోని వస్తువులు ఏవి వాడినా గ్యాస్టిక్ సమస్యలను సులువుగా అదిగమించొచ్చు.. వాటిల్లో ఏవి మీకు ఫ్లెక్సిబుల్ అయితే వాటిని వాడితే సరిపోతుంది.

నిమ్మరసం: కడుపులో గ్యాస్టిక్ సమస్య మొదలుకాగానే నిమ్మరసం వాడితే తక్షణ ఉపశమనం ఇస్తుంది. ఒక కప్పు ఉప్పులో నిమ్మరసం, అరస్పూన్ బేకింగ్ సోడా కలిపి తాగాలి. దీనిని ఉదయాన్నే తీసుకుంటే బెటర్ ఫలితాలు వస్తాయి.
పసుపు ఆకులు: పసుపు ఆకుల్ని గ్రైండ్ చేయాలి. ఆ పొడిని ఒక గ్లాస్ పాలలో కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
అల్లం: గ్యాస్ సమస్యకు మంచి మందు అల్లం. దీనిని చిన్న ముక్కలుగా చేసి రోజూ భోజనానికి ముందు నమిలి తీసుకుంటే చాలా మంచిది. ముడి అల్లం తినలేకపోతే తేనె లేదా షుగర్ తో కలిపి తీసుకోవాలి.
బంగాళాదుంప: బంగాళా దుంపల్ని గ్రైండ్ చేసి ఆ జ్యూస్ ను రోజూ భోజనానికి ముందు తాగాలి. ఇది త్వరగా ఉపశమనాన్ని ఇస్తుంది.

వెల్లుల్లి: ఇది ఎఫెక్టివ్ రెమిడీ. కొన్ని వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర విత్తనాలు, జిలకర గింజలను తీసుకుని ఐదు నిముషాలు నీళ్లలో ఉడికించాలి. ఈ ద్రావణాన్ని తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
దాల్చినచెక్క: దాల్చిన చెక్కను నీటిలో వేసి ఉడికించాలి. చల్లార్చుకున్నాక ఆ నీటిని తాగితే చాలు గ్యాస్ సమస్య పోతుంది.
యాలకులు: రోజూ 2, 3సార్లు యాలకులను నమిలితే చాలు గ్యాస్ సమస్య పోతుంది.
పెప్మర్మెంట్: గ్యాస్ సమస్యకు పెప్పర్మెంట్ టీ ఎంతో మంచిది. ఇది హెర్బల్ టీ కాబట్టి రోజుకు 2, 3 సార్లు తాగితే ఎంతో మేలు
కొబ్బరి నీళ్లు: గ్యాస్ సమస్యను తీర్చేందుకు కొబ్బరి నీళ్లు బాగా పనిచేస్తాయి. ఇందులో అసాధారణ ప్రొటీన్లు కూడా ఉంటాయి కాబట్టి రోజూ కొబ్బరి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది.
యాపిల్ సైడర్ వెనిగర్: వేడినీటిలో 3 టేబుల్ స్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని తాగాలి.
కొత్తిమీర: అజీర్తి నిర్మూలనకు కొత్తిమీర బాగా పనిచేస్తుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది. ఒక గ్లాస్ మజ్జిగలో కొత్తిమీర వేసుకుని తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
నల్ల మిరియాలు: మిరియాలను పాలలో కలిపి తాగితే గ్యాస్ సమస్య తీరుతుంది.
ఇంగువ: ఒక గ్లాస్ వేడినీటిని తీసుకుని అందులో ఇంగువ వేసుకుని బాగా కలిపి తాగాలి. ఇలా చేస్తే గ్యాస్ సమస్య, కడుపు నొప్పి, అజీర్తి తగ్గిపోతాయి. మీ రాజేందర్ యాదవ్

To Top

Send this to a friend