నిద్రమత్తును వీడండిలా..!

రాత్రి మత్తుగా నిద్రొస్తే ఓకే. కానీ ఆఫీసుకెళ్లాక మధ్యాహ్న భోజనం కాగానే నిద్రొస్తే మహా ఇబ్బంది. పనివేళల్లో కునుకుపాట్లతో తిప్పలు పడుతుంటారు. ఆ సమస్యను అధిగమించాలంటే ఈ చిట్కాలు పాటించండి.

-మధ్యాహ్నసమయంలో నిద్రను కంట్రోల్ చేయడానికి సహజమైన పరిష్కారాలు ఉన్నాయి. మీరు కూర్చునే డెస్క్ దగ్గర స్వల్ప వ్యాయామాలు చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

-ఆఫీసులో పగటి భోజనం ముగియగానే నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే, వెంటనే కుర్చీలోంచి లేచి కొద్దిదూరం చురుకైన నడకను ఆరంభించండి. ఐదు నుంచి పది నిమిషాలు అలా నడిస్తే నిద్రమత్తు కొంతవరకు తగ్గిపోతుంది.

-కుర్చీలో నిటారుగా కూర్చుని శ్వాసను లోతుగా తీసుకుని వదులుతూ ఉండాలి. నాభిపై ఒత్తిడి కలిగిందని అనిపించేవరకు ఇలా చేస్తూనే ఉండాలి. రెండు, మూడు నిమిషాలు ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది.

-మధ్యాహ్నం పనివేళల్లో నిద్ర వచ్చినట్టు అనిపిస్తే మసాజ్ చేసుకోవడం ఉత్తమం. నుదురు శిఖరం, తల చుట్టూ చర్మాన్ని కొద్దిసేపు మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తొలిగిపోయి మనసు తాజాగా ఉంటుంది.

-డెస్క్ దగ్గరే కూర్చుని కొద్దిసేపు వ్యాయామం చేయడం ద్వారా నిద్రమత్తును నియంత్రించవచ్చు.

-ఒకే స్థానంలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శక్తిస్థాయి తగ్గుతుంది. కాబట్టి మెడ వ్యాయా మం చేస్తే అవసరమైన శక్తిని అందుతుంది. నిద్ర తేలిపోతుంది.

-నిద్రమత్తులో కూరుకుపోయిన మనసును సడలించేలా చేయాలంటే చిన్నగా భుజాన్ని తిప్పాలి. భుజాలను చిన్నగా పైకెత్తి , మెడను కదిలించండి. ఇలా రెండు నిమిషాలు చేస్తే రిలాక్స్‌గా ఉంటుంది.

To Top

Send this to a friend