ఈనెల 7న చంద్రగ్రహణం.. రాఖీ కట్టొచ్చా.?

రాఖీ, రక్షా బంధన్ అని పిలిచే ఈ పండుగకు వేళయ్యింది. ఈ నెల 7న సోమవారం రాఖీ పండుగ వస్తోంది. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్యన అనుబందానికి ప్రతీక అయిన రాఖీ పండుగ ఘనంగా జరుపుకుంటారు. తమ సోదరులు ఎల్లప్పుడూ తమకు రక్షణగా ఉండాలని.. అనుబంధాలు వర్ధిల్లాలని అక్కలు, చెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి తీపి తినిపించుకుంటారు. ఇది ఎన్నో ఏళ్లుగా మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం. ఇప్పటికీ జరుపుకుంటున్నాం. ఈ సోమవారం రాఖీ పండుగను జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు.

శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగను అనాధిగా జరుపుకోవడం దేశంలో ఆనవాయితీ.. కానీ ఈసారి 7న ఉదయం 11 గంటలలోపే రాఖీ కట్టే ప్రక్రియను ముగించాలని పండితులు అంటున్నారు. ఈ ఆగస్టు 7న వచ్చే రాఖీ పండగ నాడే చంద్రగ్రహణం కూడా వస్తోంది. ఆ గ్రహణం రాత్రి 10.47 గంటలకు ప్రారంభమై రాత్రి 12.48 నిమిషాలకు ముగుస్తుందట.. కనుక ఆ రోజున మధ్యాహ్నం 1.47 నిమిషాల లోపే భోజనం ముగించేయాలని సూచిస్తున్నారు పండితులు.. ఇక రాఖీలు కట్టేవారు కూడా 7న 11 గంటలలోపే ఆ కార్యక్రమాన్ని ముగించుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. కొత్తగా జంధ్యం వేసుకునే వారు ఉదయం 10.30 గంటలలోపే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలట.. అలాగే దేవాలయాల్లో ఉదయం 10.47 గంటలలోపే దూప దీప నైవేద్యాలను పూర్తిచేయాలి. అనంతరం ఆలయ ద్వారాలు మూసివేయాలి. భక్తులకు దర్శనం కల్పించరాదు..

రాఖీ పండుగ రోజున యజ్ఞపవీతం చేసుకునే వారు సోమ మంగళవారాల్లో మాత్రమే చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు..ముఖ్యంగా ఈ సోమవారం రాఖీ పండగ నాడు రాఖీ కట్టేవారు ఖచ్చితంగా ఉదయం 11.00 గంటలలోపే తమ సోదరులకు రాఖీ కట్టేసేయాలి.

To Top

Send this to a friend