యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా ‘జయ జానకి నాయక’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు పుల్ మాస్ టైటిల్‌తో మాస్ మసాలా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు బోయపాటి ఇలా సాఫ్ట్ టైటిల్‌ను ప్రకటించగానే అంతా షాక్ అయ్యారు. అలాగే ఫస్ట్‌లుక్ కూడా ప్రేక్షకులను నిరాశ పర్చింది.
‘జయ జానకి నాయక’ ఫస్ట్‌లుక్ చాలా సాదా సీదాగా హీరో హీరోయిన్ కలిసి ఉన్నది విడుదల చేయడం జరిగింది. ఫస్ట్‌లుక్‌లో హీరోలోని మాస్ ఎలిమెంట్స్‌ను ఆవిష్కరించేలా దర్శకుడు ఎప్పుడైనా ప్లాన్ చేస్తాడు. కాని ఈసారి మాత్రం సాదా సీదాగా ఉండటం వల్ల ప్రేక్షకులు మరియు సినీవర్గాల వారు పెదవి విరిచారు. అందుకే తన అభిమానుల కోసం బోయపాటి చిత్రం సెకండ్ లుక్‌ను ఆవిష్కరించాడు.
యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తన గత చిత్రాల్లో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా హీరోను ఫుల్ మాస్‌గా చూపించినట్లుగా కొత్తగా విడుదల చేసిన ఈ పోస్టర్‌తో తేలిపోయింది. ఇలాంటి పోస్టర్ కోసం బోయపాటి అభిమానులు ఎదురు చూస్తున్నారు. సరైనోడు చిత్రం ఫస్ట్‌లుక్ కూడా ఇలాగే యమ మాస్‌గా ఉంటుంది. ఆ సినిమా మాదిరిగానే ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని అంటున్నారు.
